AP and TS / Entertainment
చిరంజీవితో రోజా జబర్దస్త్
76 days ago

సినిమావోళ్ల ప్రమోషన్ పిచ్చి పీక్స్‌ని తాకేస్తోంది. పెద్ద సినిమాలు రిలీజయ్యే సమయంలో వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి అటు ఫిల్మ్ ఇండస్ర్టీలో ఇటు ఎలక్ర్టానిక్ మీడియా బిజీగా మారడం చూస్తూనే వున్నాం. సంక్రాంతికి రిలీజయ్యే చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ కోసం ఓ ఛానెల్ నాలుగు అడుగులు ముందుకే వేసింది.

వైసీపీ ఎమ్మెల్యే కమ్ జబర్దస్త్ ఫేం, సీనియర్ హీరోయిన్ గా మూడింతలు కరిష్మావున్న రోజాను రంగంలోకి దింపేసింది. చిరంజీవితో వన్ టు వన్ ఇంటర్వ్యూ కోసం రోజానే ప్రయోగించినట్టు ఆ ఛానెల్ నుంచి అందిన ‘కమింగ్‌అప్’. ఖైదీ సినిమా విశేషాలు, మరిన్ని మెగా ముచ్చట్లే కాకుండా అంతకుమించి ఈ ఇంటర్వ్యూ నుంచి పిండుకోవాలన్నది సదరు ఛానెల్ ఆలోచన. చిరంజీవితో కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్‌గా చేసిన రోజా, ఇప్పుడు అదే చిరంజీవిని ఎలా ‘ముగ్గు’లోకి లాగుతుందో చూడాలి. 

 

 
 
 
Related News

JournalistDiary