AP and TS / Entertainment
రుద్రమదేవి వర్సెస్ శాతకర్ణి
12 days ago

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకి డైరెక్టర్ గుణశేఖర్ రాసిన లేఖ ఫిల్మ్ సర్కిల్స్ లోనేకాదు, అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. తాను స్వీయదర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి సినిమాకు ఎపి సర్కారు వినోదంపన్ను రద్దు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ... తాను కట్టిన వినోదపు పన్నును తిరిగి తనకు వెనక్కి ఇవ్వాలంటూ గుణశేఖర్ చంద్రబాబుని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, అప్పట్లో ఎపి సర్కారు ఎందుకు రుద్రమదేవి సినిమాకి పన్నుమినహాయింపు ఎందుకు ఇవ్వలేదు..ఇవ్వలేకపోవడానికి కారణాలేంటి? తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మినహాయింపు ఇచ్చినాకూడా చంద్రబాబు ఎందుకు ఆపని చేయలేదన్నది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్లు. అయితే, బాలకృష్ణ సినిమా గౌతమిపుత్రశాతకర్ణికి మొదట  వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది తెలంగాణ సర్కారు. ఆ తర్వాతే, ఎపి ప్రభుత్వం ఎపి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తాయని ముందే భావించిన చంద్రబాబు తెలంగాణ సర్కారు ఓకే అన్నతర్వాతే పన్ను మినహాయింపు ఇచ్చారని మరికొందంటున్నారు. అయితే, రుద్రమదేవి సినిమా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేపథ్యంకాబట్టే కెసిఆర్ మినహాయింపునిచ్చారని, చంద్రబాబు ఇవ్వలేకపోయారన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

 
 
 
Related News

JournalistDiary