AP and TS / Entertainment
జక్కన్న భారతానికి అంత సీనుందా ?
256 days ago

మహాభారతాన్ని సరికొత్తగా చూపించాలన్నది బాహుబలిశిల్పి జక్కన్న డ్రీం. అయితే, ఇది ఏ రేంజ్ లో ఉంటుందన్న దానిపై కొంత క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. బాహుబలి మజిలీలపై ఏర్పాటు చేసిన సౌత్ కాన్‌క్లేవ్ 2017లో తన మనసులోని బలమైన కోరికను బయటపెట్టాడు.

మహాభారత కథను ప్రపంచమే అబ్బురపడేలా సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలన్నదే తన చిరకాల కోరిక అన్నాడు. మహాభారతం నుంచి ఓ పాత్రను తీసుకున్నా.. ఓ ఉపకథను ఎంపిక చేసుకొన్నా అవి ఎంతగానో ప్రభావితం చేస్తుందన్నారు. బాహుబలి సినిమా ప్రభావాన్ని జనం 30 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకోవాలన్నాడు రాజమౌళి. భాషకు, సినిమాకు సంబంధం లేదని, విజువల్సే కథను, ఎమోషన్లను ప్రేక్షకులకు చేరవేస్తాయని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 

 
 
 
Related News
JournalistDiary