AP and TS / Entertainment
బాబోయ్.. ఫిదా బ్యూటీ కాస్ట్‌లీ
69 days ago

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఫిదా’ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఓవర్సీస్‌లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. హైబ్రీడ్ పిల్ల భానుమతిగా సాయిపల్లవి తన నటనతో అందరికీ ఫేవరెట్ అయిపోయింది. దాంతో ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఐతే, పల్లవి చెబుతోన్న రెమ్యునరేషన్ విని ప్రొడ్యూసర్లు షాక్ అవుతున్నారట.

ఫిదాలో నటించినందుకు సాయి పల్లవికి కేవలం 25 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చారట. అప్పటికే మళయాళ ‘ప్రేమమ్’ ద్వారా పాపులరయిన ఆమెకి 25 లక్షల రెమ్యునరేషన్ అంటే చాలా తక్కువే! ఇక ఫిదా హిట్‌తో తన రెమ్యునరేషన్‌ని 70 లక్షలకు పెంచేసిందట. ఫిదా లాంటి హిట్ తర్వాత ఏ హీరోయిన్ అయినా కోటి పైనే డిమాండ్ చేస్తుందని, సాయిపల్లవి మాత్రం క్రేజ్‌ని క్యాష్ చేసుకోకుండా రీజనబుల్ రెమ్యునరేషన్ అడుగుతోందని ఆమె డేట్స్ కోసం వెళ్ళిన ప్రొడ్యూసర్లు అంటున్నారట. కానీ మిగతా హీరోయిన్లు అయితే పల్లవి కాస్ట్ చూసి షాకవుతున్నారట.

 

Read Also

 
Related News
JournalistDiary