India / Politics
నలుగురు భార్యలు.. 40 మంది పిల్లలు
167 days ago

బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. దేశ జనాభా పెరిగేందుకు వాళ్లే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మీరట్‌లోని ఓ దేవాలయం ప్రారంభోత్సవానికి హాజరైన ఈ ఎంపీ, జనాభా పెరుగుదలకు హిందువులు కారణం కాదని, నలుగురేసి భార్యలు, నలభై మంది పిల్లలు విధానాన్ని సమర్థిస్తున్న వాళ్లే దీనికి కారణమని ఆరోపించారు. పిల్లలను కనడానికి తల్లులేమీ యంత్రాలు కాదని చెప్పుకొచ్చారు. ట్రిపుల్‌ తలాక్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం దగ్గరైందని, ఉమ్మడి పౌరస్మృతి త్వరలో అమల్లోకి వస్తుందని వ్యాఖ్యానించారు. 

 

ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘించినట్టేనని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ నేత కేసీ మిట్టల్‌ తెలిపారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలు తీవ్రం కావడంతో కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ స్పందించారు. సాక్షి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే తప్ప, పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ మతాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, ఈసీ ముందు విచారణకు సిద్ధమేనని అన్నారు సాక్షి మహరాజ్. ఏడాది కిందట కూడా దేశంలో హిందూ జనాభా పెరగాలంటే ఒక్కొక్కరు నలుగురేసి పిల్లలను కనాలంటూ బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే! 


 

 
 
 
Related News

JournalistDiary