India / Politics
నాన్న.. కొడుకు.. ఓ పాత సైకిల్..!
227 days ago

ఉత్తరప్రదేశ్ అధికారపార్టీ అయిన సమాజ్ వాదీపార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్' వ్యవహారం హస్తినకు చేరింది. సైకిల్ గుర్తు తమదంటే తమదంటూ తండ్రీకొడుకులిద్దరూ ఢిల్లీబాట పట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ - ఆపార్టీ అధినేత..అఖిలేష్ తండ్రి ములాయంసింగ్ యాదవ్ ల మధ్య చెలరేగిన వార్ సద్దుమణిగినట్టే మణిగి మళ్లీ ఒక్కసారిగా రాజుకోవడంతో యూపీ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీకి మారాయి. 

ఎన్నికల సంఘం ముందు తన వాణి వినిపించేందుకు ములాయం సింగ్ యాదవ్ ఢిల్లీలో మంతనాలు సాగిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ తో కూడిన ములాయం బృందం మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ముందు తమదే అసలు ఎస్పీ అని.. సైకిల్ గుర్తు తమకే చెందుతుందని వాదించింది. మరోవైపు, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేష్.. పార్టీపై తనకున్న పట్టు ఈసీ ముందు నిరూపించుకుని సైకిల్ గుర్తు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలాఉంటే, ఈనెల 5న జరుపతలపెట్టిన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ములాయం వర్గం ప్రకటించింది.     


 
 
Related News