India / Crime
ఎమ్మెల్యే బాడీగార్డు వద్ద రూ. 99 కోట్లు !
225 days ago

యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకీ బాడీగార్డు గులాం జిలానీ సిద్దికీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కాన్పూర్ లోని ఎస్ బీ ఐ లో ఉన్న  తన ఖాతాలో ఇతనికి 73 వేల బ్యాలన్స్ ఉంది.

అయితే ఈ అకౌంట్ లో రూ. 99 కోట్లు క్రెడిట్ అయ్యాయి. మొత్తం 99 కోట్ల 99 లక్షలు జమ అయినట్టు వచ్చిన రిసిప్ట్ చూసి నిర్ఘాంతపోతూనే ఈ విషయాన్ని తన బాస్ ఇర్ఫాన్ సోలంకీ కి తెలియజేశాడు. ఆయన ఎస్ బీ ఐ అధికారుల దృష్టికి తీసుకురాగా..పరిశీలిస్తామని అన్నారు. బహుశా ఇది సాఫ్ట్ వేర్ పొరబాటై ఉంటుందని భావిస్తున్నారు.


 
 
Related News