AP and TS / Entertainment
మొత్తానికి సమంత అలా బ్యాలెన్స్ చేసిందా?
9 days ago

అత్తారింటికి దారి వెతుక్కున్న సమంత.. ఆ కల్యాణ ఘడియలు ముగియగానే పేరును కూడా మార్చేసుకుంది. నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని కోడలుగా మారిన మరునాడే..  సోషల్ మీడియాలో పేరు మార్చుకుంది. ట్విటర్‌లో ఇన్నాళ్లూ ఆమె పేరు ‘సమంత రుత్‌ ప్రభు’ అని ఉండేది. ఇప్పుడు దాన్ని ‘సమంత అక్కినేని’ అంటూ రీనేమ్ చేసుకుంది.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం రుత్‌ ప్రభు అనే ఉంచుకుంది. ఇందులో మర్మమేమిటన్నది తెలీదు. సమంత పెళ్లి తర్వాత తొలిసారిగా ఓంకార్ డైరెక్షన్లో  ‘రాజుగారి గది 2’ మూవీలో కనిపించనుంది. తమిళ హీరో విజయ్‌ పక్కన చేసిన ‘అదిరింది’ దీపావళి రిలీజ్. ‘రంగస్థలం 1985’, ‘సావిత్రి’ సినిమాలు ఇంకా సెట్స్ మీదే వున్నాయి. సినిమా కరియర్ కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడ్తుందన్న క్లారిటీ లేకపోయినా, సోషల్ యాక్టీవిటీస్, సోషల్ మీడియాలో మాత్రం సామ్ తన జోష్ ని కంటిన్యూ చేస్తుందట!

 

 

Read Also

 
Related News
JournalistDiary