AP and TS / Entertainment
సమంత కండిషన్ అందుకేనా!
29 days ago

టాప్ హీరోయిన్ సమంత మీద రూమర్లు, గాసిప్స్ ఎక్కువగా రావనే విషయం తెలిసిందే. మిగతా హీరోయిన్లతో పోలిస్తే సమంత మీద గాసిప్స్ రావడం చాలా తక్కువ. అందుకు సమంత సింప్లిసిటీ, ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడడమే కారణం అయింది. అయితే.. ఇప్పుడు సమంత లేటెస్ట్‌గా తమిళ్‌లో శివకార్తికేయన్‌తో చేస్తోన్న మూవీ యూనిట్‌కి ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

అదేంటంటే.. తనకి స్కిన్ అలర్జీ వుందని, అందుకే తన పార్ట్ షూటింగ్ ఔట్ డోర్‌లో వున్నపుడు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తన మీద ఎండ పడకుండా షూటింగ్ స్పాట్ మొత్తం క్లాత్‌తో కవర్ చేయాలని సమంత కండిషన్ పెట్టిందట. ఆమధ్య రామ్ చరణ్ ‘రంగ స్ధలం’ మూవీ షూటింగ్ సమ్మర్‌లో జరిగినపుడు సమంతకి వడదెబ్బ తగిలిన సంగతి విదితమే. దాంతో ఆ షెడ్యూల్‌కి బ్రేక్ పడింది. అందుకే.. ఇప్పుడలా జరగకూడదనే సమంత ముందుగానే కండిషన్ పెట్టిందని అంటున్నారు.

 
 
Related News