AP and TS / Entertainment
పెళ్లి తర్వాత తొలిసారి సమంత, ఆ విషయం చెప్పొద్దన్న యూనిట్
9 days ago

మ్యారేజ్ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చింది హీరోయిన్ సమంత. ఆమె నటిస్తున్న ‘రాజగారి గది 2’ మూవీ శుక్రవారం రానున్న నేపథ్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. త‌నపై ఎంతో అభిమానం చూపిస్తోన్న వాళ్లకి ధ‌న్యవాదాలు చెబుతూనే, ఈ మూవీలో ప‌ని చేసిన అనుభ‌వం బాగుంద‌ంటూ మనసులోని మాట బయటపెట్టింది.

ఈ సందర్భంగా ఓ విష‌యాన్ని చెప్పాలని స‌మంతా భావించింది.. ఇంతలోనే వద్దని యూనిట్ రిక్వెస్ట్ చేయడంతో డ్రాపైపోయింది.. దీంతో అంద‌రూ బిగ్గర‌గా న‌వ్వేశారు.  ఇంతకీ ఆ విషయం ఏంటంటూ చర్చించుకోవడం సోషల్ మీడియాలో మొదలైంది. తాను ఇప్పుడు అక్కినేని వారి కోడ‌లినని స‌మంత వ్యాఖ్యానించింది. అక్కినేని ఫ్యామిలీలో ఆడ‌వారికి ఎంతో ప్రయార్టీ వుంటుందని, అమ‌ల ఎంతో ఇండిపెండెంట్‌గా ఉంటార‌ని వ్యాఖ్యానించింది. త‌న బెస్ట్ ఫ్రెండ్‌ నాగచైతన్యని పెళ్లి చేసుకున్నాన‌ని పేర్కొంది. 

 

 

Read Also

 
Related News
JournalistDiary