AP and TS / Entertainment
చైతూ అమ్మమ్మ చీరతో సమంత
17 days ago

నాగచైతన్య - సమంత పెళ్లి అక్టోబర్ మొదటివారంలో జరగనుంది. మూడురోజులపాటు గోవాలో ముఖ్యఅతిధుల సమక్షంలో జరిగే ఈ వేడుక అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు స్పెషల్ ఈవెంట్ కానుంది. నార్త్ స్టైల్‌లో జరిగే ఈ వివాహ వేడుక సందడి.. సంప్రదాయం సమ్మేళనంగా జరగనుంది. పెళ్లిపీటలపై సమంత ధరించే చీరకో ప్రత్యేకత ఉందట.

 

చైతు అమ్మమ్మ రాజేశ్వరి (కీ.శే.రామానాయుడు శ్రీమతి) అప్పటి పెళ్లి చీరను ఈ జనరేషన్‌కు తగ్గట్టు ముంబై డిజైనర్స్ క్రెషా బజాజ్ రూపొందించినట్టు టాక్. ఇక నిశ్చితార్థంలో క్రెషా డిజైన్ చేసిన చీర ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడువారే ఈ జంటకు మూడురకాల అవుట్ ఫైట్స్ జ్యుయెలరీ డిజైన్ చేస్తున్నారట. చైతూ అమ్మమ్మ చీరతో ఈ రెండు కుటుంబాలను గౌరవించి.. సమంత మరిన్ని మార్క్స్ కొట్టేయనుందని ఫిలింనగర్ టాక్.

 
 
Related News