India / Crime
చిన్నమ్మకు చిక్కులు
288 days ago

అమ్మస్థానాన్ని అందిపుచ్చుకోవడం అంత సులభం కానప్పటకీ ఆ దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోతోన్న చిన్నమ్మకు అవాంతరాలు అంతకంటే స్పీడ్ గా ఎదురవుతున్నాయి. అమ్మ నియోజకవర్గం నుంచి పోటీచేసి ముందుకు వెళ్లాలనుకుంటోన్న ఆమె ఆశల్ని ఆర్కే‌నగర్ వాసులే అడ్డుకుంటున్నారు. అమ్మకు ఆమె మేనకోడలు దీపా మాత్రమే ప్రత్యామ్నాయమంటూ నొక్కి ఒక్కానిస్తున్నారు. 

ఇదంతా ఒకెత్తయితే, ఇప్పుడు తన మేనల్లుడి రూపంలో శశికళ(చిన్నమ్మ)కు మరో తలపోటు వచ్చింది. అన్నాడీఎంకే మాజీ మంత్రి..శశికళ మేనళ్లుడు అయిన టీటీవీడీ దినకరన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెద్దమొత్తంలో జరిమానా విధించింది. పెరా ఉల్లంఘన కేసులో దినకరన్కు ఈడీ రూ.28 కోట్ల జరిమానా విధించినట్టు మద్రాసు హైకోర్టు శుక్రవారం ధృవీకరించింది. 

 

Read Also

 
Related News
JournalistDiary