India / General
మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే -సుప్రీంకోర్టు
9 days ago

మైనర్ భార్యతో శృంగారమంటే అది అత్యాచారమేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత ఐపీసీ చట్టాల
ప్రకారం.. ఓ వ్యక్తి 18 ఏళ్లలోపు భార్యతో శారీరక సంబంధం కలిగి ఉంటే అది నేరమవుతుందని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో
15 నుంచి 18 ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని తేల్చేసింది. దీనిపై ఓ స్వచ్ఛంద
సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ తీర్పు నిచ్చింది.

 

మైనర్ భార్యతో లైంగిక సంబంధం ఉన్నట్లయితే సదరు భార్య.. భర్తకు వ్యతిరేకంగా ఏడాదిలోపు న్యాయస్థానంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. బాల్య వివాహం చట్టవ్యతిరేకం అయినప్పుడు 15 ఏళ్ల నుంచి 18ఏళ్ల బాలికలపై కాపురం పేరుతో లైంగికచర్యకు పాల్పడటం చట్టం ఎలా అవుతుందని ప్రశ్నించింది. దేశంలోని సుమారు 2.3 కోట్ల మంది మైనర్ వధువులకు ఈ నిబంధన ద్వారా మేలు జరుగుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని 18 నుంచి 29 ఏళ్ల మహిళల్లో 46 శాతం మందికి 18 ఏళ్లకు ముందే వివాహం చేస్తున్నట్లు తేలింది.

 

Read Also

 
Related News
JournalistDiary