India / Sports
బెంగళూరు తరహాలో... మరో షాకింగ్ ఘటన
285 days ago

బెంగళూరులో పోకిరీల ఆగడాల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు మహారాష్ర్టలో అలాంటి షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. లోనావాలోలో కొంతమంది పోకిరీలు పర్వతారోహకులను దారుణంగా కొట్టారు. డిసెంబర్ 31న పూణెకి 50 కిలోమీటర్ల దూరంలోవున్న లోనావానాలోని విసాపూర్ కోటకు ఓ పర్వాతారోహకులు టీమ్ వెళ్లింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో 12 మంది పోకిరీల గ్రూప్ ఒకటి ట్రెక్కర్లపై దాడి చేసింది. మహిళలను రక్తం వచ్చేలా కొట్టింది. చివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది. ఇప్పటివరకు ఆరుగుర్ని మాత్రమే అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా వాళ్ల కోసం గాలింపు చేపట్టారు.

 

Read Also

 
Related News
JournalistDiary