India / Crime
తండ్రి ఫీజు కట్టలేదని కూతుళ్లను..
124 days ago

బీహార్‌లో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ దారుణం.. ఓ తండ్రి ఫీజు కట్టలేదని కూతుర్లకు ఊహించని రీతిలో శిక్ష వేసింది యాజమాన్యం. దుస్తులు విప్పించి అందరిముందు నిలబెట్టి వీధుల్లో నడిపించింది. ఈ ఘటన బెగుసరాయ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు సామాన్యులు.

చున్‌చున్‌షా అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ చెప్పాలనే ఆశతో ఓ ప్రైవేటు పాఠశాలలో జాయిన్ చేయించాడు. ఒకరు ఒకటో తరగతి చదువుతుండగా మరొకరు నర్సరీ విద్యార్థిని. పిల్లలకు స్కూల్‌ యూనిఫాం, ఫీజులు చెల్లించడంలో కాస్త ఇబ్బందితలెత్తింది. చెల్లించే స్తోమత లేక కాస్త సమయం కోరడంతో కుదరదని చెప్పేసింది స్కూల్‌ యాజమాన్యం. అందరూ చూస్తుండగానే ఓ టీచర్‌ ఇద్దరు పిల్లల దుస్తులు విప్పించేసి బయటకు తోసేశాడు. ఏడుస్తూ వీధుల వెంట నడుస్తున్న ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని ఓ వ్యక్తి వాళ్లకి బట్టలు ఇచ్చాడు. ఈ ఘటనపై వారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను మరోవ్యక్తిని అరెస్టు చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary