World / Health
స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్..
89 days ago

బెత్ గూడియర్... వయసు 22 సంవత్సరాలు..  ఈమె ఒక్కసారి ఒళ్లు విరుచుకుని మేను వాల్చిందంటే ఇక అంతే!  

ఆరునెలల వరకు మూసిన కళ్లు తెరవదు.. గూడియర్ లీన్ లెవిన్ సిండ్రోమ్(Kleine-Levin syndrome... KLS)కు గురైన కారణంగా మరో మాటలో చెప్పాలంటే స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ కారణంగా అలానే నిశ్చలంగా పడి ఉంటుంది. అలా రోజులు.. వారాలు కాదు.. ఒక్కోసారి ఆరునెలలు వరకు నిద్ర లేవడం కష్టం. బెత్ గూడియర్ గురించి డిటేల్స్‌లోకి వెళ్తే.. ఫ్యూచర్ గురించి ఒక ప్లాన్. ఆత్మ విశ్వాసం కలిగిన బెత్, గ్రాడ్యుయేషన్  కంప్లీట్ చేసుకుని చైల్డ్ సైకాలజీలో స్పెషలైజేషన్ చేయాలన్నది టార్గెట్. అయితే  ఐదేళ్లకిందట జరిగిన ఘటన‌తో ఆమె ఫ్యూచర్ ప్లానంతా మారిపోయింది. తన 17వ ఏట తన బర్త్ డే‌కి రెడీ అవుతున్న బెత్ హఠాత్తుగా అస్వస్థతకు గురైంది.

ఇక అప్పటినుంచి బెత్ స్లీపింగ్ సిండ్రోమ్‌కు గురైంది. ఒక్కసారి నడుం వాల్చిందండే ఆరు నెలల వరకు అంతే.. నిద్రలోనే నడక, తినాలన్నా, తాగాలన్నా! రోజులో 22 గంటలు పడుకునే ఉంటుంది బెత్. మేలుకున్న మిగతా రెండు గంటలకాలంలో టాయిలెట్ ఎక్స్‌ట్రా పనులు కంప్లీట్ చేసుకుంటుంది. అంతే రోజు మొత్తంలో 75 శాతం బెత్ స్లీపింగ్‌లో ఉంటుంది.  ఐదేళ్ల నుంచి ఈ వ్యాధికి గురైన బెత్‌తోపాటు బ్రిటన్‌లో మరో 100 మంది లీన్‌, లెవిన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఐతే, బెత్ కేసులాంటి మరో కేసును చూస్తున్న డాక్టర్స్ టీం.. బెత్ యధాస్థితికి రావచ్చన్న ఆశాభావం వ్యక్తంచేసింది. బెత్‌ను టోటల్‌గా పరీక్షించి మెదడులో కొద్దిగావాపు, జెనెటిక్ ప్రభావం కారణంగా థాలమస్‌, హైపోథాలమస్ పనితీరులో తేడాలొచ్చి అతి నిద్రకు కారణమౌతున్నాయనే విషయాన్ని గుర్తించారు. ఆమె మేల్కొన్నప్పుడు మైండ్‌లో గుర్తున్న గ్రాడ్యుయేషన్, చైల్డ్ సైకాలజీ‌లో స్పెషలైజేషన్ చేయాలన్న బెత్ కోరికల గురించి మాట్లాడితే త్వరలో మామూలు స్థితికి రావొచ్చంటున్నారు డాక్టర్లు. 

 

 

 

 
 
 
Related News

JournalistDiary