World / Health
పొగరాయుళ్ళూ.. కుంపటి ఆర్పాల్సిందే..
203 days ago

స్టయిల్ గా వేళ్ళమధ్య  సిగరెట్ తిప్పుతూ గాల్లోకి రింగులు పొగ వదులుతున్న స్మోకర్లను చూసి అసూయపడే  రోజులు పోయి జాలిపడే టైమ్ వచ్చిందంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే మీరు పొగ తాగితే పొగ మిమ్మల్ని  తాగేస్తుందట. మీరు తాగే పొగ పురుషుల్లోని వీర్యాన్ని ఫలదీకరణం కానీయకుండా చంపేస్తుందట. దీనికి తోడు వృషణాల్లో డిఎన్ ఏ దెబ్బ తినడం, వాపులకు కారణమౌతుందంటున్నారు డాక్టర్లు.

నిన్న మొన్నటిదాకా పిల్లలు కావాలనుకున్న దంపతుల్లో మహిళలు స్మోకింగ్ మానేయాలని చెప్పారు. కానీ బ్రెజిల్ నుంచి ఇప్పుడొచ్చిన కొత్త నివేదికల ప్రకారం పురుషులు కూడా స్మోకింగ్ మానేయాలట. లేని పక్షంలో  పురుషుడిలోని వీర్యకణాలను నిర్వీర్యం చేయడమేకాక.. మహిళల్లో ఫలదీకరణం జరగకుండా అడ్డుకుంటుందట. దీనికి తోడు స్మోకింగ్ అలావాటు ఉన్న పురుషుడి స్పెర్మ్ ను పలుచగా చేసేస్తుందట. ఫలితంగా ఆక్సీకరణ ప్రక్రియ మిరింత దెబ్బతినిపోతుందని తేల్చారు. మరొక్క విషయం.. బ్రెజిలియన్ డాక్లర్ల స్టడీస్ ప్రకారం పర్యావరణ కాలుష్యం, ఊబకాయం, అతిగామద్యం సేవించడం కూడా సంతాన లేమికి కారణమౌతాయట.

పొగతాగడంవల్ల వీర్య కణాల కదిలికల్లో తేడా కారణంగా వీర్యంలో సామర్ద్యం తగ్గిపోతుందని తేలింది. సిగరెట్ లో ఉండే నికొటిన్ కారణంగా వీర్యంలో మామూలు స్థాయిలో ఉండాల్సిన  దానికంటే సూపర్ ఆక్సైడ్,హైడ్రాక్సిల్ స్థాయి పెరగడం వల్ల స్పెర్మ్ మెంబ్రేన్ లో తేడాలొచ్చి వీర్యకణాల సంఖ్య దెబ్బ తింటుందని చెబుతున్నారు.  నికోటిన్ అతిగా శరీరంలోకి చేరితే... పురుషోత్పత్తి అంగాలు వాచిపోయి వీర్యవృద్ధి మందగిస్తుందనీ, కాబట్టి మీరు స్మోకర్లయితే వీలైనంత  త్వరగా దానికి గుడ్ బై చెప్పండి..కాక పోతే దాని జోలికే వెళ్ళకండంటున్నారు వైద్యులు. సో..మీ  ఫ్యామిలీ మీ చేతుల్లోనే ఉందన్నమాట.

 
 
 
Related News

JournalistDiary