World / Health
మెన్ డౌన్‌ఫాల్ .. వుమెన్ ఇంక్రీజ్డ్
665 days ago

ఇండియాలో ఇదో వినూత్న పరిణామం. రెండేళ్లలో స్మోకర్ల సంఖ్య 10శాతం తగ్గిపోగా, మరోవైపు వుమెన్ స్మోకర్స్ సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ట్యాక్స్‌ల పుణ్యమో, రేట్లు పెరిగిపోయిన విపరీతమో తెలీదుగానీ ఈ నిష్పత్తి ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. అమెరికా తర్వాత ఇండియా ఈ విషయంలో సెకండ్ ప్లేస్ ఆక్రమించిదట. 

పార్లమెంటులో హెల్త్ మినిస్ర్టీ ఇచ్చిన లెక్కల ప్రకారం 2014-15లో సిగరెట్ల వినియోగం 93.2 బిలియన్ స్టిక్స్ కాగా, అంతకుముందు ఏడాది ఇది 117 నుంచి 105 బిలియన్లుగా వుండేదని వెల్లడైంది. అంటే సుమారు 10 బిలియన్లు తక్కువయ్యాయని విశ్లేషించారు. ఐతే, ఇదే సమయంలో సిగరెట్లను ఊదేసే మహిళల సంఖ్య 1980ల్లో 5.3 మిలియన్లు వుండగా, 2012 నాటి ఇది 12.7 మిలియన్లకు పెరిగిపోయింది. 

187 దేశాల్లో సిగిరెట్ల వినియోగంపై అధ్యయనం జరిపిన వాషింగ్టన్ యూనివర్సిటీ కూడా తన తాజా లెక్కల నివేదికను గతేడాది రిలీజ్ చేసింది. పొగాకు వినియోగం ఇండియాలో తగ్గిపోవడం మంచి పరిణామమే ఐనప్పటికీ, దీని వాడకం వల్ల వ్యాధులు పెరిగిపోవడం ఆందోళనకర విషయం. ముఖ్యంగా స్మోకింగ్‌లో మహిళల సంఖ్య పెరగడంతో పుట్టే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

యువతీయువకులు కూడా స్మోకింగ్ పట్ల ఆకర్షితులు కావడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామాల్లో పొగాకు వినియోగం పెరిగినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. పట్టణాల్లో 38శాతం మంది పురుషులు, 12 శాతం మంది మహిళలు వుంటే... రూరల్ ఏరియాల్లో 52శాతం పురుషులు, 24శాతం మంది మహిళలున్నారు. 

 

 

Read Also

 
Related News
JournalistDiary