World / Health
వెజ్‌లో నాన్‌ వెజ్..
380 days ago

మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత మీరు నమ్ముతారా? అయితే.. మీరు తినే వెజిటేరియన్ ఫుడ్స్‌లో నాన్ వెజిటేరియన్ ఉంటుందనే నిజాన్ని మీరూ నమ్మాల్సిందే! అదెలా అంటే.. కొన్నిరకాల తిండి పదార్ధాల్లో జంతువుల మాంసం నుంచి ఎముకలు నుంచి సేకరించిన పదార్ధాలను అందులో కలుపుతారట. సో..  బై బర్త్ మీరు నాన్వెజిటేరియన్ కాకపోయినా తినే వెజిటేరియన్ పుడ్స్ లో కాస్తోకూస్తో నాన్ వెజ్ కలిపినవే అంటున్నారు ఆహార నిపుణులు. మనం తీసుకునే రోజువారీ వెజిటేరియన్ ఫుడ్స్‌లో నాన్ వెజ్ కలిసిన కొన్ని పుడ్ ఐటెమ్ గురించి తెలుసుకుందాం..

1. వైట్ షుగర్..

వైట్ షుగర్ వాడుతున్నారంటే మీరు ఎమకల పొడి తింటున్నట్టే! ఎందుకంటే కొన్ని  పశువుల ఎముకల చూర్ణాన్ని వైట్ షుగర్‌లో కలుపుతారట. ఎముకలను కాల్చి బూడిద చేయగా వచ్చిన చూర్ణాన్ని ఇందులో వినియోగిస్తారట. అఫ్‌కోర్స్ ఫుడ్స్‌లో వాడే బ్రౌన్ షుగర్‌లో కూడా ఇదే పరిస్థితి. సో.. చెరకు గడల నుంచి వచ్చిన చక్కెర వాడితే మంచిదని సెలవిస్తున్నారు.

2. వెనిలా ఐస్ క్రీం..

ఐస్ క్రీం ప్రియులు అతి ఇష్టంగా తినే ఫ్లేవర్ వెనీలా! ఈ ఐస్ క్రీంకు ఆ ఫ్లేవర్ రావడానికి ఓ రకమైన జంతువు స్రవించే పదార్థం నుంచి సెస్టోరియం అనేది సంగ్రహిస్తున్నారట. శరీరమంతా వెంట్రుకలతో కప్పబడి ఉండే ఈ జంతువు తన ఉనికి చాటుకోవడానికి  శరీరం గ్రంథుల నుంచి వచ్చే ఒక రకమైన సువాసన కల ద్రవాన్ని వదులుతుంది. దానిని సంగ్రహించి ప్రొసెస్ చేసి ఐస్ క్రీంలు, ఇతర ఆహార పదార్ధాల్లో వాడతారు. అయితే ఇది వాడినందువల్ల  ఎటువంటి ప్రమాదం లేదని ఎఫ్‌డి‌ఏ కూడా ధృవీకరించింది. అయితే గర్భవతులు మాత్రం ఈ వెనీల వాడకపోడమే మంచిదట.

 

3. ఆరెంజ్ జ్యూస్..

మీరు జ్యూస్ ప్రియులా? అలసిపోయి కాసింత కూల్‌గా ఆరెంజ్ జ్యూస్ తాగి రిలాక్స్ అవుతున్నారా? అయితే ఆరెంజ్ జ్యూస్‌తోపాటు ఫిష్ ఆయిల్, గొర్రె వెంట్రుకల నుంచి వచ్చని పదార్ధాన్ని కూడా తాగుతున్నట్టేనని అంటున్నాయి పరిశోధనలు. ఆకర్షణీయమైన బాటిల్స్‌లో చల్లచల్లగా నోరూరించే ఆరెంజ్ జ్యూస్‌కు నాచురల్‌గా ఆ టేస్ట్ రావాలంటే కొద్దిగా కష్టమేనట. అందుకే కొన్ని‌రకాల  చేపల నుంచి సంగ్రహించిన ఒమేగా రసాయనాలు, గొర్రె వెంట్రుకల నుంచి సేకరించిన లానోలిన్ అనే మైనం లాంటి పదార్ధాన్ని   ఆరెంజ్ జ్యూసుల్లో వాడతారట. పేరుకి రకరకాల బ్రాండ్‌ల అరెంజ్ జ్యూసులు దొరుకుతున్నా.. ఈ రెండు రకాల కెమికల్స్ లేకుండా మాత్రం దొరకవంటున్నారు.

4.రిఫ్రైడ్ బీన్స్

కాస్త ముసురు పట్టినా, టైం పాస్ కోసమో చాలా మంది రిఫ్రైడ్ బీన్స్ ఇంట్రెస్ట్‌గా తింటారు. అలా తినేవారికో షాకింగ్ న్యూస్. మరేం లేదు.. అందులో పోర్క్ ఫ్యాట్ కలుపుతారట. ప్యూర్ వెజిటేరియన్లు ఇతర ధాన్యాలతో కలిపి తినే ఫ్రైడ్ బీన్స్‌ను ట్రెడిషనల్ మెక్సికో రెస్టారెంట్లలో పోర్క్ ఫ్యాట్ కలపడం కామన్ అట. ఫ్రైడ్ బీన్స్ రుచిలో రహస్యమిదేనట. 

5. నాన్ ఆర్గానిక్ అరటి పండ్లు..

పసుపుపచ్చగా ఎట్రాక్టివ్‌గా కనిపించే అరటి పండ్లు అంటే ఇష్టపడని వెజిటేరియన్‌లు తక్కువ. ఐతే, దీన్లో కూడా ఒక మతలబు ఉందట. పండ్లు మరిన్ని రోజులు ఫ్రెష్‌గా కనబడాలంటే వాటి‌పై ఓ రకమైన ప్రిజర్వేటివ్ చల్లుతారట. కాకపోతే ఈ ప్రిజర్వేటివ్ రొయ్యలు, పీతల గుల్లల నుంచి సేకరిస్తారని సైన్స్ డైలీ పేర్కొంది. షెల్ ఫిష్ ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం అరటిపండ్లు జాగ్రత్తగా చూసి తినండంటున్నారు.

6. బిస్కెట్లు,బ్రెడ్లు

బిస్కెట్లు, బ్రెడ్లు, కేక్‌లు ఇష్టపడేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ అవి తినేవాళ్లందరూ వాటితోపాటు బాతు, కోడి వెంట్రుకలు తిన్నట్టే అంటున్నాయి పరిశోధనలు. మామూలుగా బ్రెడ్లు, బన్లు, కేకులు చేయాలంటే పిండి, నీళ్లు, ఉప్పు, ఈస్ట్‌తోపాటు బాతు, కోడి ఈకల్లో నుంచి తీసిన క్రిస్టీన్ అనే ఎంజైమ్‌ను కలుపుతారట. ఈ ఎంజైమ్ కలపడం వల్ల కేకులు, బ్రెడ్లు మరింత మృదువుగా వస్తాయట. ఇవేకాకుండా గార్లిక్ బ్రెడ్, పిజ్జా తయారీలో కూడా ఈ క్రిస్టీన్ ఎంజైమ్ వాడతారట.

7. ఇంపోర్టెడ్ వైన్లు, బీర్లు

ఫారిన్ బీర్లు, వైన్లు అంటూ లొట్టలేసుకుని తెగ తాగేసే మందుబాబులకో షాకింగ్ న్యూస్. లెక్కా జమా లేకుండా ఇంపోర్టెడ్ వైన్లు, బీర్లు తాగుతున్నారంటే మీరు ఫిష్ బ్లాడర్లు తాగుతున్నట్టే లెక్క అని అంటున్నాయి తాజా పరిశోధనలు. నిజంగానే అంటే నిజమే.. కొన్ని రకాల బీర్లు, బైన్లు ముఖ్యంగా బ్రిటన్‌లో తయారయ్యే వివిధ రకాల పానీయాల్లో్ ఫ్రెష్ వాటర్ ఫిష్ బ్లాడర్ నుంచి సేకరించిన జెలటిన్ లాంటి పదార్ధం. దీన్ని బీర్లు, వైన్‌లలో కలుపుతారట.

8. బార్బిక్యూ పొటాటో చిప్స్

మీరు చిప్స్ ప్రియులా? తెగ ఇష్టంగా కరకరా నమిలేస్తుంటారా? అయితే మీరు తినేది వెజిటేరియన్ చిప్స్ కాదు.. నాన్ వెజిటేరియన్ చిప్సేనట. బార్బిక్యూ చిప్స్‌కు ఫ్లేవర్ రావడానికి చికెన్ లేదా బీఫ్ ఫ్యాట్ కలుపుతారట. సో.. అదీ వెజ్‌లో నాన్ వెజ్ అంటే అయిందా? ఇక నుంచి లేబుల్స్ చెక్ చేసుకుని మరీ తినండి! 


 

Read Also

 
Related News
JournalistDiary