India / Entertainment
‘స్పైడర్‌’ టీజర్.. భయపెట్టడం మాకూ తెలుసు
72 days ago

దసరా సందర్భంగా మహేష్‌బాబు- రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా వస్తున్న మూవీ ‘స్పైడర్’. బుధవారం మహేష్‌బాబు బర్త్ డే
సందర్భంగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు. దాదాపు నిమిషం పైగానే నిడివిగల ఈ టీజర్‌లో ప్రిన్స్‌ని అన్నికోణాల్లో
చూపించాడు డైరెక్టర్ మురుగదాస్.

‘‘పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే’’ అని ఎస్‌జే సూర్య చెప్పిన
డైలాగ్, దీనికి కౌంటర్‌గా ‘‘ఆ రోజు అంతమంది జనంలో దాక్కున్నావే.. అదే భయం.. భయపెట్టడం మాకు తెలుసు’’ చెప్పిన
డైలాగ్ కూడా బాగుందని చెబుతున్నారు. ఇక గ్రాఫిక్స్‌ ఎక్కువగానే వున్నాయి. టీజర్ చూసినవాళ్లు మాత్రం ఇటీవల సొసైటీలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా స్పైడర్‌ని తెరకెక్కించినట్టు చెబుతున్నారు. కానీ యూనిట్ మాత్రం ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, చూడాల్సినవి మూవీలో చాలానే వున్నాయని అంటున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary