AP / general news
శ్రీ‌శైలం గేట్లు ఎత్తివేత.. కృష్ణమ్మ పరుగులు
8 days ago

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో రెండు గేట్లు ఎత్తి.. 56 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు.

అంతుకు ముందు ఏపీ మంత్రి దేవినేని ఉమా గురువారం ఉదయం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం ఆరుగంటలకు 884 అడుగులకు నీరు చేరింది.

దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్దిరోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు అధికారులు.

 

Read Also

 
Related News
JournalistDiary