India / Business
12 దొంగ కంపెనీల్లో లాంకో ఇన్‌ఫ్రా‌టెక్
122 days ago

మొండి బకాయిలపై యుద్ధాన్ని ప్రకటించిన రిజర్వ్‌బ్యాంక్, కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. రూ.5 వేల కోట్ల కంటే అధికంగా రుణాన్ని తీసుకొని చెల్లించని డజన్ సంస్థలను ఇటీవల గుర్తించింది. ఇందులో ఐదు స్టీల్ కంపెనీలున్నాయి. దీనికి సంబంధించి ఓ ఇంగ్లీష్ డైలీ ఓ వార్తను ప్రచురించింది. మొండిబకాయిల విలువ అక్షరాలా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు.

ఈ జాబితాలో భూషణ్ స్టీల్ (రూ. 44,477 కోట్లు), లాంకో ఇన్‌ఫ్రా టెక్ (రూ.44.364 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37.283 కోట్లు), భూషణ్ పవర్ - స్టీల్స్ (రూ. 37.243 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు)‌, ఏబీజీ షిప్‌యార్డ్ (రూ. 6,953 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ (రూ. 10.273 కోట్లు), మన్నెత్ ఇస్పాత్ (రూ. 12.115 కోట్లు), ఎర ఇన్‌ఫ్రా (10,065 కోట్లు), జేపీ ఇన్‌ఫ్రా టెక్ (రూ. 9.635 కోట్లు), జ్యోతి స్ర్టక్చర్స్ (రూ. 5.165 కోట్లు) వంటి కంపెనీలున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంక్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మొండి బకాయిల్లో ఈ సంస్థల వాటా 25 శాతంగా ఉంది.

ఇచ్చిన గడువులోగా చెల్లించపోతే దివాలా చట్టానికి లోబడి ఆయా సంస్థలకు చెందిన ఆస్తులను ఆరు నెలల్లో విక్రయించే అధికారం ఉంది. ఎన్‌పీఏలపై దివాలా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విషయంలో ప్రతిపాదనలు చేసేందుకు ఆర్‌బీఐ అంతర్గత సలహా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రతిపాదనకు అనుగుణంగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయనుంది ఆర్‌బీఐ.

 

Read Also

 
Related News
JournalistDiary