World / Health
డయాబెటిస్ పేషెంట్స్ వైన్ తీసుకోవచ్చా?
675 days ago

టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న పేషెంట్స్ వైన్ తీసుకోవచ్చా? అన్న అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. రోజూ కొద్దిమోతాదులో రెడ్ వైన్ తీసుకుంటే అది ఈ పేషెంట్స్‌లోని కొలస్ర్టాల్ స్థాయిని అదుపులో వుంచుతుందని, గుండె సంబంధిత వ్యాధులకు కూడా మెడిసన్‌గా పనిచేస్తుందని తాజా స్టడీలో తేలింది. రెడ్, వైన్‌ గ్లూకోజ్ కంట్రోల్‌ను మెరుగుపరుచుతుందని ఇజ్రాయెల్‌కి చెందిన బెన్ గురియన్ యూనివర్సిటీ రీసెర్చర్లు పేర్కొన్నారు.

డయాబెటిస్ పరిశోధనల్లో‌వున్న యూరోపియన్ ఫౌండేషన్ కూడా ఈ వాదనను సమర్థిస్తోంది. ఐతే, వైన్‌కు, మధుమేహానికి మధ్య వున్న తారతమ్యాలను పరిశీలించాల్సివుంది. పండ్ల నుంచి వైన్ ను తయారు చేస్తారనే క్యాంపెయిన్ అనాదిగా వుంది. అందువల్ల ఇది మధుమేహ రోగుల్లో మరింత చక్కెర శాతాన్ని పెంచవచ్చనే వాదన కూడా లేకపోలేదు. రెండేళ్లపాటు సుమారు 224 మంది టైప్-2 మధుమేహ రోగులకు రెడ్ లేదా వైట్ వైన్‌ను, 150 మి.మీ. మినరల్ వాటర్‌ను ఇస్తూ రీసెర్చ్ చేయగా, ఈ ఫలితాలు వెలుగుచూశాయి.

వీరి గ్లూకోజ్, కొలస్ర్టాల్ స్థాయి అదుపులో వున్నట్టు తేలిందని చెబుతున్నారు. ఐతే, భారతీయ డాక్టర్ల వాదన మరోలా వుంది. వైన్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు చక్కెర లెవల్ అదుపులో వుంటుందనడానికి శాస్ర్తీయ ఆధారాలు లేవని ముంబై బాంద్రాలోని లీలావతి ఆసుపత్రి డాక్టర్ శశాంక్ జోషి అంటున్నారు. భారతీయులు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగావున్న ఆహారాన్ని తీసుకుంటారని, ఆల్కహాల్ దీన్ని మరింత పెంచవచ్చని ఢిల్లీ ఫోర్టీస్ హాస్పటల్‌కు చెందిన మరోడాక్టర్ అనూప్ మిశ్రా విశ్లేషించారు. మొత్తానికి డయాబెటిస్ పేషెంట్స్‌ వైన్ తీసుకోవడం మంచిదా? కాదా అనేదానిపై పరిశోధనలు షురూ అయ్యాయి. 

 
 
Related News