AP and TS / Entertainment
అంజలిని అలా చూస్తూ వుండాలనిపించింది
75 days ago

‘న‌రుడా.. డోన‌రుడా’ తర్వాత హీరో సుమంత్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం గౌత‌మ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ‘మళ్లీ రావా’ ఫిల్మ్ చేస్తున్నాడు. అందుకు సంబంధించి ఓ చిన్న టీజర్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ‘‘13 ఏళ్ల తర్వాత అంజలిని మళ్లీ చూశాను.. అంజలిని అలా చూస్తూ వుండాలనిపించింది, గుర్తు పట్టలేదా, గుర్తు కూడా లేదా? అనే డైలాగ్ హీరోకి పర్‌ఫెక్ట్ గా సూటబుల్ అయ్యిందని అంటున్నారు సినీ లవర్స్.

ఇందులో సుమంత్ పక్కన ఆకాంక్షసింగ్ హీరోయిన్. క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ గౌత‌మ్ తిన్ననూరి అందించ‌గా, శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. టీజ‌ర్ రావడంతో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీపై భారీగానే అంచనాలను పెంచేసింది.

 

Read Also

 
Related News
JournalistDiary