AP and TS / Entertainment
ప్రిన్స్ మూవీలో సూపర్‌స్టార్!
9 days ago

మహేష్‌బాబుతో కొరటాల శివ ‘భరత్ అనే నేను’ ఫిల్మ్ చేస్తున్నాడు. ప్రిన్స్.. ఫస్ట్ టైమ్ పొలిటీషియన్‌గా కనిపించనుండడంతో  ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ పెరిగింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణ ముఖ్యమంత్రి రోల్‌లో కనిపిస్తాడని  లేటెస్ట్ న్యూస్. రోల్ చిన్నదే అయినా మూవీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టే కృష్ణ అయితేనే బాగుంటుందని డిసైడ్ అయ్యాడట. కొరటాల. 

దాదాపు 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ కృష్ణ- మహేష్ కలిసి నటిస్తున్నారు. రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ సినిమాల తర్వాత కృష్ణ - మహేష్ కలిసి నటించే ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం లక్నో‌లో భారీ షెడ్యూల్ చిత్రీకరణ జరుగు తోంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేసే ప్రయత్నాల్లో మేకర్స్ వున్నారట. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 
 
Related News