AP and TS / Entertainment
హీరోయిన్ సస్పెన్స్ వీడింది..
6 days ago

విక్రంకుమార్ డైరెక్షన్‌లో అఖిల్ ఓ ఫిల్మ్ చేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ ఇవ్వాలని భావించిన నాగార్జున, ఈ ప్రాజెక్ట్‌కి
సంబంధించి ప్రతీ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకొంటున్నాడు. అందుకే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినా హీరోయిన్ ఎవరు
అనేది రివీల్ చేయడంలేదు. దీంతో అఖిల్ హీరోయిన్ ఎవరంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చించుకోవడం మొదలైంది.

అఖిల్ పక్కన హీరోయిన్‌గా శ్రీదేవి కూతురు జాహ్నవి, మేఘా ఆకాష్‌ల పేర్లు బలంగా వినిపించినప్పటికీ అదేం లేదంటూ
తోసిపుచ్చాడు నాగ్. ఇన్‌సైడ్ సమాచారం మేరకు నాగార్జున ఇప్పటికే హీరోయిన్‌ని ఫైనల్ చేసినా, కావాలనే రివీల్ చేయలేదని అంటున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది తను చెప్పేవరకు సస్పెన్స్ గానే వుంచాలని యూనిట్‌కి ఆర్డర్ వేశాడట నాగార్జున. మొత్తానికి కొడుక్కి హిట్ ఇవ్వడం కోసం నాగ్ మంచి ప్లాన్ వేశాడని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.

 

 
 
 
Related News

JournalistDiary