India / Crime
20 ఎకరాల బరి గీసిన నిత్యానంద బ్యాచ్
122 days ago

తన రింగారింగా ఎపిసోడ్స్ తో తమిళనాడులోని తురువన్నామలైకు దూరమైన స్వామి నిత్యానంద మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. అయితే, ఈసారి బడా ప్లాన్ తో తన అనుచరగణాన్ని రంగంలోకి దింపాడు. జనసంచారం పెద్దగా ఉండని ఊరు శివారు కొండప్రాంతంపై కన్నేసిన నిత్యానందగణం 20 ఎకరాలమేర బరిగీశారు. అందులో గుడారాలేసి నిత్యానంద ఫొటోలు విగ్రహాలు పెట్టి, పూజలు మొదలెట్టారు. ఈ సెటప్ అంతా చూసి భక్తులు క్యూ కడతారనుకున్నారు.

అయితే, సీన్ ఫుల్ రివర్స్ అయిపోయింది. భక్తి ముసుగులో భక్తులను మత్తులో ముంచడం, ఆశీర్వాదాలంటూ ఆడాళ్లతో తైతక్కలాడడం.. ఇలా ఏక్ నంబర్ దగా స్వామిగా పాపులరయిపోయిన నిత్యానంద ఫొటో చూడగానే స్థానికులకు చిర్రెత్తుకొచ్చింది. వాళ్లంతా మూకుమ్మడిగా దాడిచేసి గుడారాలు పీకేసి, నిత్యానంద ఫొటోలను తొక్కేశారు. అంతే.. యధావిధిగా నిత్యానంద అనుచరగణం ఊగిపోతూ వింత చేష్టలకు దిగి తమ గురువు మూర్ఖత్వానికి అద్దం పట్టారు. ఖాకీలు వచ్చినా సరే కదల్లేదు. దీంతో పోలీసులు, జనం కలిసి నిత్యానంద ముఠాను తరిమి తరిమికొట్టారు.

 

Read Also

 
Related News
JournalistDiary