India / General
శారీ కట్టుకోని నీ సారీ నాకొద్దు..హీరోయిన్ పై ప్రతాపం
21 days ago

తమిళ సినీయర్ నటుడు టి రాజేందర్(తమిళ హీరో శింబు తండ్రి) రెచ్చిపోయారు. ‘కబాలి’ ఫేం ధన్సికను మీడియా ముందు తీవ్రంగా అవమానించారు. క్షమించాలని ఎంతగా కోరిన ఆగని రాజేందర్ ఆద్యంతం తన ప్రసంగంలో శివాలెత్తిపోయారు. దీన్ని భరించలేకపోయిన ధన్సిక కన్నీరు పెట్టుకున్నారు. ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘విళిథిరు’. ఈ మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ధన్సిక మాట్లాడుతూ మొత్తం యూనిట్‌ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే, ఈ మూవీలో ఓ పాటలో నటించిన టి.రాజేందర్‌ పేరును ప్రస్తావించడం మర్చిపోయింది.

అంతే, ఇది మనసులో పెట్టుకున్న రాజేందర్ తన ప్రసంగం మొత్తం చిందులేశారు. రజనీకాంత్‌తో కలిసి ‘కబాలి’లో నటించినంత మాత్రాన దాని తర్వాత చేసిన ‘విళిథిరు’ గురించి మర్చిపోవాలన్న నియమం లేదని విమర్శించారు. దీంతో ధన్సిక వెంటనే రాజేందర్ పాదాలు తాకి క్షమించమని వేడుకుంది.అయినా ఆగని రాజేందర్.. ‘నువ్వు శారీ కట్టుకోలేదు. కాబట్టి నీ సారీ నాకు అక్కర్లేదు. నువ్వు హన్సిక అయితే నాకేంటి. ధన్సిక అయితే నాకేంటి’ అని మరింత ఆక్రోశాన్ని ప్రదర్శించారు. రాజేందర్‌ ఇలా రెచ్చిపోతుంటే, అక్కడి జనం రాజేందర్ ను ఆపలేదు సరికదా, ధన్సిక కన్నీటిని పట్టించుకోకుండా కేరింతలు, చప్పట్లతో వింతగా ప్రవర్తించడం విశేషం.

 

 

Read Also

 
Related News
JournalistDiary