AP and TS / Politics
టీ కాంగ్రెస్‌కి బాహుబలి ?
Today

ఆయనే వుంటే ఈ పీకుడెందుకన్నది ఒకానొక మోటుసామెత. పగ్గాల్ని పిడికిట్లో బిగబట్టి బండిని ముందుకు నడిపించిన వైఎస్సార్ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఒక మోస్తరుగా వెలిగింది. నయానోభయానో అందర్నీ ఒక్కతాటి మీద నడిపించిన నాయకుడుగా రాజశేఖర్రెడ్డి నిలబడిపోయాడు. ఇప్పుడు రాష్ట్రంతో పాటు పార్టీ కూడా చీలి రెండయ్యింది. ఏపీ కాంగ్రెస్ జగన్ కాంగ్రెస్ గా రూపు మార్చుకుంది. తెలంగాణా కాంగ్రెస్ మాత్రం క్యాడర్ చీలిపోకుండా ఇంటాక్ట్ గానే వుండిపోయింది. సరైన లీడర్ లేడన్న లోటొక్కటే ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా..?

 

జగ్గారెడ్డి, జానారెడ్డి, జీవన్రెడ్డి, కోమటెడ్డి, ఉత్తమ్ రెడ్డి. చివరకు డీకే అరుణ అనబడే ఆ గద్వాల రెడ్జెమ్మ దాకా అందరూ ఎవరికివాళ్లు ఎడ్డమంటే తెడ్డెమనేవాళ్లే. ఎవ్వరి కటౌట్ సైజుల్ని వాళ్లే డిసైడ్ చేసుకుంటూ.. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇదేనంటూ సర్దేసుకునే సామర్థ్యాలూ వాళ్లవే. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ మీటింగ్ లో సైతం.. తెలంగాణా పీసీసీయులు ఎవరికివాళ్లు కండలప్రదర్శనకు దిగేశారు. 2019లో పవర్లోకొచ్చేది తామేనంటూ తొడలు కొట్టుకున్న వీళ్లందరికీ నిఖార్సయిన నాయకుడంటూ ఎవ్వడూలేడన్న సందేహం ఆ రాహుల్ గాంధీక్కూడా కలిగేవుంటుంది. ఈ లోటును ఎలా పూడ్చుకోవాలనేది హైకమాండ్ ముందున్న వెరీ నెక్స్ట్ టార్గెట్.

 

 

 
 
 
Related News

JournalistDiary