AP / general news
వర్మకు ఎమ్మెల్యే అనిత వార్నింగ్
8 days ago

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తానని చెబుతోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి ఇప్పటికే వర్మ పై విమర్శలు గుప్పిస్తే, తాజాగా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిత వర్మకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దన్నారు.

ఎన్టీఆర్ మహానుభావుడని ఆయన ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలని సూచించారు. ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని అనిత హెచ్చరించారు. చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే బ్రతికి ఉన్న వైఎస్ జగన్‌పై కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారని ఆమె అన్నారు. అదే జరిగితే, జగన్ ప్రజల్లోకి వెళ్లలేరని ఆమె చెప్పుకొచ్చారు.

 

Read Also

 
Related News
JournalistDiary