World / Health
పసుపు.. సూపర్ ఫుడ్డెహె..
390 days ago

మన వంటింటి అల్మారాలో అందుబాటులో వుండే సంజీవిని లాంటి  ఔషధాన్ని వదిలేసి మందుల కోసం వెంపర్లాడవద్దంటున్నాయి పరిశోధనలు. పాతకాలం నుంచి భారత సంప్రదాయం‌లో భాగంగావున్న పసుపు సూపర్ ఫుడ్ అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముత్యమంత పసుపుతో మేని ఛాయను పెంచుకోవచ్చంటారు.. అయితే పసుపుపై జరిగిన  మరిన్ని పరిశోధనల్లో అది దివ్యౌషధం అని తేలింది.

సూపర్ ఫుడ్డుగా పిలుస్తున్న పసుపుతో ఛాతీలో మంట మొదలు అనేక రుగ్మతలతోపాటు ఫుడ్ పాయిజనింగ్‌కు విరుగుడు మందుగా పని చేస్తుందని తేల్చారు సైంటిస్టులు. డైలీ ఆహారంలో ఒక టీ స్పూన్ పసుపు వాడితే మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని యూఎస్ స్టడీస్ తేల్చాయి. దీనితోపాటు మెదడులో ఉండే అల్జీమర్స్ వ్యాధికి కారణమైన కణాలను నాశనం చేసే శక్తి కూడా పసుపులో ఉందని రుజువైంది. ఏళ్ల తరబడి పసుపు  వాడుతున్న భారతీయుల్లో బౌల్ క్యాన్సర్ రేట్ తక్కువగా ఉన్నట్టు గమనించారు.  బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి ఎలుకల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది కూడా. సో..  క్రమం తప్పకుండా డైలీ ఆహారంలో పసుపు వాడితే మీ హెల్త్ సూపరెహె ..

 

Read Also

 
Related News
JournalistDiary