AP and TS / Entertainment
ప్రభాస్‌తో మూవీ చేయాలంటే, తమన్నా
92 days ago

బాహుబలి తర్వాత మిల్కీ‌బ్యూటీ తమన్నాకి తెలుగులో ఆఫర్లే లేకుండా పోయాయి. సందీప్ కిషన్‌తో చేస్తోన్న బైలింగ్యువల్ మూవీ తప్పితే ఆమెకి ఇప్పటికీ మరో ఆఫర్ రాలేదు. వున్నట్లుండి తన పరిస్ధితి ఇలా అయిపోయిందేమిటని ఫ్రెండ్స్ దగ్గర వాపోతోందట తమన్నా. కానీ మీడియా ముందు మాత్రం ఈ విషయంలో చాలా తెలివిగా తప్పించుకుంటోందట ఈ బ్యూటీ.

 

ప్రభాస్‌తో మరో ఆఫర్ వస్తే నటిస్తారా అని అడిగితే.. ముందు కథ నచ్చాలి కదా, అప్పుడే ప్రభాస్‌ పక్కన నటించడం గురించి
ఆలోచిస్తానంటూ అంటోందట. ఆఫర్లు రాక సందీప్ లాంటి చిన్న హీరోతో సినిమా చేస్తున్న మిల్కీబ్యూటీ, కథ నచ్చితేనే
ప్రభాస్‌తో చేస్తానని చెప్పడం ఫన్నీగా వుందని అంటున్నారు సినీలవర్స్. మరి.. రెబల్ సినిమా స్టోరీ విన్న తర్వాతే చేసిందా
అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary