India / Politics
అనుష్కకి చేదు అనుభవం..
79 days ago

బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది అనుష్క. కానీ తమిళనాడులో ఈమెకి చేదు అనుభవం ఎదురైంది.
అనుష్క నటిస్తున్న ‘భాగమతి’ ఫిల్మ్ షూటింగ్ పొల్లాచి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఐతే, స్థానిక రవాణాశాఖ అధికారులు ఆమెకి చుక్కలు చూపించారు. తనిఖీలో భాగంగా కార్వాన్‌కి సంబంధించి డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో దాన్ని సీజ్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాన్‌ను ఉపయోగిస్తున్నారని, అందుకే స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మరో వాహనంలో అనుష్క వెళ్లింది. దీనిపై అనుష్క భాగమతి నిర్మాతలపై కోపంగా వున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం.

 

Read Also

 
Related News