AP / Politics
తెలుగు తమ్ముళ్ల లుంగీ డ్యాన్స్‌
80 days ago

న్యూఇయర్ అంటే ఆ మజాయే వేరు. ఆ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు కొందరు టీడీపీ నేతలు. ఓ వైపు లుంగీ డ్యాన్స్, మరోవైపు గంగనమ్ స్టెప్పులతో హంగామా చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన కొత్త సంవత్సరం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో స్టేజీపై మహిళా డ్యాన్స్‌లతో కలిసి టీడీపీ మండలాధ్యక్షుడు పుల్లారెడ్డి, కనిగిరి మున్సిపల్‌ ఛైర్మన్‌ చినమస్తాన్‌ చిందులేశారు నేతలు. 

ఆ సమయంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే కూడా అక్కడే వుండడం గమనార్హం. నేతలు డ్యాన్స్ చేయడంతో అక్కడికొచ్చినవాళ్లు ఆ సీన్‌ని హవ్వా అంటూ రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపించింది. 

 

 
 
 
Related News

JournalistDiary