Telangana / Politics
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
62 days ago

 తెలంగాణ కేబినెట్‌ నాలుగు ఆర్డినెన్స్‌లు జారీ చేసింది.  ఈనెల 20న గొర్రెల పంపిణీ పథకం ప్రారంభానికి ఆమోద ముద్రవేసింది. ఈ పథకాన్ని సి.ఎం కేసీఆర్ గజ్వేల్‌ నుంచి ప్రారంభించనున్నారు. పోలీస్‌శాఖలో 26,296 పోస్టుల భర్తీకి కేబినెట్‌ నిర్ణయించింది.

ప్రాజెక్టుల భూనిర్వాసితులకు మత్స్య సంపదలో భాగస్వామ్యం కల్పించాలని కూడా కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హరితహారం కింద 40 కోట్ల మొక్కలు నాటాలని శనివారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 

 

Read Also

 
Related News