AP and TS / General
జిల్లాల్లో హైదరాబాద్‌ని మించిన ఐటీ హబ్స్
123 days ago

దాదాపు వెయ్యికి పైగా ఐటీ సంస్థలతో 'సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్' అనే ఆభరణం హైదరాబాద్ కీర్తి కిరీటం నుంచి జారిపోబోతోంది. హైదరాబాద్‌కి మించి జిల్లాల్లో ఐటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ తరహాలో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మెగా ఐటీ హబ్ లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు. తెలంగాణ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ 2016 పాలసీలో భాగంగా జిల్లాలు, మండల స్థాయిలో ఐటీ పరిశ్రమను వికేంద్రీకరణ చేయబోతున్నారు. రెండు బడా ఐటీ కంపెనీలు..  సియ్యాంట్ లిమిటెడ్, ఎక్లంట్ హెల్త్ సొల్యూషన్స్ వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు షురూ చేశాయి.

గతవారం, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో కూడా ఒక IT ఇంక్యుబేషసెంటర్ ఏర్పాటుకు పునాది రాయి వేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఈ సెంటర్స్ ఏర్పాటుకు రూ. 25 కోట్లు కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే వంటోనిస్ సాఫ్ట్వేర్ (డల్లాస్, యుఎస్),  కాకతీయ ఐటి సొల్యూషన్స్ వంటి ఇతర కంపెనీలు వరంగల్లోని ఐటి ఇంక్యుబేషన్ టవర్ లలో కార్యకలాపాలు ప్రారంభించాయి. టైర్ -2 నగరాలకు పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఆస్తి పన్నులో రాయితీలు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఐటీ నిపుణులను తయారు చేయడంలో భాగంగా 'తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్' (TASK) ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 527 ఇంజనీరింగ్.. ఇతర గ్రాడ్యుయేషన్ కళాశాలలు టాస్క్ తో ముడిపడిఉన్నాయి. ఇప్పటివరకూ TASK యొక్క కార్యక్రమాల ద్వారా 60,000 మందికి పైగా శిక్షణ పొందారు.

 

Read Also

 
Related News
JournalistDiary