Telangana / Politics
రైతుల క్షేమమే మాధ్యేయం- సీఎం కేసీఆర్
122 days ago

రైతుల క్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకోసం కరెంటు బిల్లు 10 వేల కోట్లయినా చెల్లిస్తామన్నారు. తెలంగాణలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు, వాటి నిర్వహణకు 11,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఆ మేరకు వివరాలతో కూడిన ఓ సమగ్ర నివేదికను ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు శుక్రవారం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఎత్తిపోతలకు 400 మెగావాట్లు వుండగా, ఇప్పుడు 1263 మెగావాట్ల కరెంట్‌ను వినియోగిస్తున్నారు.

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 4600, పాలమూరుకు 4 వేలు, సీతారామ ప్రాజెక్టుకు 690 మెగావాట్ల విద్యుత్‌ అవసరమని అధికారులు పేర్కొన్నారు. చిన్నస్థాయి ప్రాజెక్టులు కూడా పూర్తయితే మొత్తం 11,500 మెగావాట్ల కరెంట్ వినియోగించాల్సి ఉంటుందని, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే నాటికి తెలంగాణలో విద్యుదుత్పత్తి 27 వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. కరెంటు సరఫరాకు అత్యధిక వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు సీఎం కేసీఆర్. ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఫోటోలను చూద్దాం..

 

Read Also

 
Related News
JournalistDiary