World / Crime
టెన్నిస్ ప్లేయర్‌ని కత్తితో పొడిచి..
239 days ago

టెన్నిస్‌ ప్లేయర్ పెట్రా క్విటోవా మీద దాడి జరిగింది. మంగళవారం ఆమె వుంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు పెట్రాపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన క్విటోవాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం ఏమీలేదని, ఆమె ఎడమచేతికి గాయమైనట్టు డాక్టర్లు తెలిపారు.

చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన 26 ఏళ్ల పెట్రా క్విటోవా ఎడమచేతి ప్లేయర్. ప్రపంచ ర్యాంకింగ్‌లో 11వ స్థానంలోవున్న ఆమె, 2011, 2014లో వింబుల్డన్‌ టైటిల్‌ని గెలుచుకుంది. ఐతే, ఈ దాడి వెనుక ఏం జరిగింది అనేది తెలియాల్సివుంది. 

 

Read Also

 
Related News