India / Entertainment
మాజీ ప్రధాని బ‌యోపిక్ ఫ‌స్ట్‌లుక్
75 days ago

బాలీవుడ్‌లో బ‌యోపిక్ సీజ‌న్ స్పీడందుకుంది. నిన్నటివరకు స్పోర్ట్స్ ప‌ర్సనాలిటీస్‌పై సినిమాలు రాగా, ఇప్పుడు ద‌ర్శక
నిర్మాత‌లు పొలిటిక‌ల్ లీడ‌ర్స్‌పై ఫోకస్ పెట్టారు. తాజాగా మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్‌సింగ్‌ లైఫ్‌స్టోరీ ఆధారంగా ఓ ఫిల్మ్
రానుంది. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.

గతంలో మన్మోహన్‌కు మీడియా సలహాదారుగావున్న సంజయ్‌బారు రాసిన పుస్తకం 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌' ఆధారంగా దీన్ని తెరకెక్కుతోంది. ఇక మ‌న్మోహ‌న్ పాత్రని అనుప‌మ్ ఖేర్ చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో దీన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. విజ‌య్ ర‌త్నాక‌ర్ గుత్తే డైరెక్షన్‌లో తెర‌కెక్కుతుంది. మన్మోహ‌న్ జీవితంలో కీల‌క వ్యక్తులైన సోనియా, రాహుల్ క్యారెక్టర్ల కోసం సెర్చింగ్ మొదలైంది. ఆగ‌స్ట్ 30న టీజ‌ర్ విడుద‌లకి ప్లాన్ చేస్తుండ‌గా, 2019లో మూవీని రిలీజ్ చేయాలన్నది భావిస్తున్నారు.

 
 
Related News