World / Health
‘జికా’పై కంగారెందుకు?
562 days ago

జికా వైరస్‌పై ప్రపంచమంతటా కంగారెత్తుతోంది. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని, దీనికి మందులు లేవని హెచ్చరిస్తున్నారు. ఐతే, భయపడాల్సిన పనిలేదని కూడా చెబుతున్నారు. నిజానికి ఈ వైరస్ కొత్తదేమీ కాదట. 1940 ప్రాంతంలోనే దీన్ని గుర్తించారట. జికా రుగ్మత చాలా అరుదని, హానికరం కాదన్న విషయం చాలామందికి తెలియదట.

గతేడాది మే నెలలో బ్రెజిల్‌లో ఈ వ్యాధి పెద్దఎత్తున వ్యాపించింది. సుమారు 10 లక్షల మందికి ఇది సోకిందని అంచనా! ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇంటర్నేషనల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. 24 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది. దీనికి వ్యాక్సీన్ గానీ, మందులుగానీ లేవని అన్నారు కూడా! ఐతే, భయపడాల్సిన పనిలేదని, ఇవన్నీ భ్రమలు మాత్రమేనని ఓ వెబ్‌సైట్ అంటోంది. 

 

1. భ్రమ.. జికా ప్రపంచవ్యాప్తంగావున్న ప్రమాదకరమైన వ్యాధి

వాస్తవం.. ప్రస్తుతం ఈ వ్యాధి అమెరికా, కరేబియన్ దీవుల్లో మాత్రమే వుంది. 

 

2. భ్రమ... జికా అనేది కొత్త వ్యాధి.. వేలాదిమంది మరణించవచ్చు.. 

వాస్తవం.. ఈ వ్యాధి డేంజర్ కాదు. చిన్న ఫ్లూ మాత్రమే

 

3. భ్రమ... ఇది ఈ సంవత్సరపు ఎబోలా

వాస్తవం... జికా వల్ల ఇప్పటివరకు ఎవరూ మరణించలేదు. కానీ, ఎబోలా వ్యాధివల్ల 11 వేల మంది ఆఫ్రికన్లు మరణించారు. 

 

4. భ్రమ... ఇండియాలో ఈ వ్యాధి త్వరలో ప్రవేశించవచ్చు

వాస్తవం...  ఎబోలా వ్యాధి 18 నెలలపాటు వుండగా.. ఇండియాను ఇది తాకలేదు

 

5. భ్రమ...  జికా సోకిన గర్భిణులకు చిన్న మెదడుతో కూడిన పిల్లలు పుడతారు.

వాస్తవం.. ఇందుకు ఇంకా ఆధారాలు లేవు.. పౌష్టికాహార లోపం కూడా ఇందుకు కారణం కావచ్చు.

 

6. భ్రమ.. ఇండియాలో ఈ వ్యాధి గురించి ఎవరికీ తెలియనందున దీని తాకిడి తీవ్రంగా వుండవచ్చు.

వాస్తవం.. 1953లోనే ఇండియాలో జికాను గుర్తించారు. 

 

7. భ్రమ.. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు భారతీయ ఆసుపత్రుల్లో పరికరాలు, సాధనాలు లేవు

వాస్తవం.. ఎబోలా, డెంగ్యూ వ్యాధిల్లా కాకుండా జికా పేషెంట్లు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు

 

8. భ్రమ.. జికాను నిరోధించే మార్గమే లేదు.. 

వాస్తవం.. దోమలను నివారించి కలుషితమైన నీటిని తాగకుండా జాగ్రత్త వహించాలి, ఏడ్స్ అనే రకం దోమలు కుడితే డాక్టర్ల సలహాపై ఆయింట్ మెంట్ పూస్తే సరిపోతుంది.

మొత్తానికి ఇది ప్రాణాలను కబళించే వ్యాధి కాదని, పెద్దఎత్తున వ్యాపించలేదని తెలుస్తోంది.. ఈ కారణం వల్లే సైంటిస్ట్‌లు ఈ వ్యాధికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునే పనిలోపడ్డారు. ఏమైనప్పటికీ ఈ వ్యాధి గురించిన భయాన్ని గోరంతలు కొండంతలు చేయడం జరిగింది. మరిన్ని పరిశోధనలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 
 
Related News