World / Health
ఆకారంలో ఆరోగ్య రహస్యం..
450 days ago

మనం తీసుకునే ఆహార పదర్ధాల ఆకారాల్లోనే ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయంటున్నాయి తాజా నివేదికలు. మనం తీసుకునే ఆహారం మన శరీరంలో ఒక్కో షేపును పోలి ఉంటుంది. అది తీసుకుంటే సంబంధిత అవయవాలకు మరింత చురుకుదనాన్నిస్తుందట. దీనికి తాజా సర్వేలే కాదు.. పాతరోజుల నుంచి కూడా ఫలానా ఆ పదార్ధాలను తినండని పెద్దలు చెప్పడంలో సీక్రెట్ ఇదేనంటున్నాయి నివేదికలు. ఉదాహరణకు కిడ్నీలను పోలి ఉండే బీన్స్, వాల్ నట్స్, కార్నియాలా ఉండే క్యారెట్, శరీరంలో ఎముకల మాదిరి కాండంతో కూడి ఉండే ఆకుకూరలు.. ఇలా నేచర్‌లో దొరికే మొక్కలు,జంతువులు, ఖనిజాలు వాటి ఆకారాల్లో  ఆరోగ్య రహస్యాలు ఒదిగి ఉన్నాయి. అలా అవయవాలను పోలి ఉండే కొన్ని ఆహార పదార్ధాలను ఉదాహరణగా తీసుకుంటే..

క్యారెట్.. 

ఆహారంలో తీసుకునే క్యారెట్ అడ్డంగా కట్ చేస్తే కంటి రెటీనాను పోలి ఉంటుంది. అలానే క్యారెట్ తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. కంటికి తీసుకుపోయే రక్తనాళాల్లో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతోబాటు బీటా కెరొటిన్ పుష్కలంగా ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.

వాల్ నట్..

బాగా పరికించి చూస్తే.. దాని ముడుతలు, ఆ మెదడును గుర్తు చేస్తాయి. చిన్నమెదడు షేపులో ఉండే వాల్ నట్‌లో ఒమేగా 3 యాసిడ్లు, న్యూరాన్లన అభివృద్దికి తోడ్పడే లక్షణాలు ఉన్నాయట. తరచూ వాల్ నట్ ఆహారంలో తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుందట. అందుకే వాల్ నట్‌ను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు.

ఆకుకూరలు..

కొన్ని రకాల ఆకుకూరలు పరిశీలిస్తే.. శరీరంలో ఎముకల మాదిరిగానే ఉంటాయి. ఆకుకూరల కాడలు ఎముకల షేపును గుర్తుకు తెస్తాయి. సాధారణంగా శరీరంలో ఉండే బోన్స్‌లో 23 శాతం సోడియం ఉంటే.. కొన్ని రకాల ఆకుకూరల్లో కూడా 23 శాతమే సోడియం ఉంటుందట. ముఖ్యంగా వీటిలో ఉండే సిలికాన్ ఎముకలకు గట్టిదనాన్నిస్తుంది.

ఆరెంజ్, ద్రాక్ష..

శరీరంలో వక్షోజాలనుపోలి ఉండే ఈ రెండురకాల పండ్లు చాలా మేలు చేస్తాయి. ద్రాక్షలో ఉండే లిమొనాయిడ్స్ అనే బ్రెస్ట్ సెల్స్ పెరుగులకు తోడ్పతాయి. స్తనాల్లో ఉండే లింఫ్ అనే ద్రవాన్ని కూడా ఈరెండు రకాల పండ్లు సమతౌల్యం చేస్తాయట.

స్వీట్ పొటాటో (చిలకడ దుంప) 

శరీరంలోపల ఉండే పాంక్రియాసిస్‌ను పోలి ఉండే చిలకడ దుంపలో మూలకాలు పాంక్రియాసిస్ పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యవంతంగా ఉండేలా తోడ్పడుతుందట. చిలకడ దుంపలో ఎక్కువ మోతాదులో ఉండే బీటాకెరోటిన్, యాంటి ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడటం వల్ల వయసు వల్ల వచ్చే ముడుతలు తగ్గుతాయి. అంతేకాదు డయాబెటిక్ వల్ల వచ్చే గ్లైసిమిక్ ఇండెక్స్‌లో హెచ్చుతగ్గులు రాకుండా కూడా కాపాడుతుంది.

టొమాటో..

టొమాటోను అడ్డంగా కోసి చూస్తే.. గుండె గుర్తుకొస్తుంది. అచ్చం హార్ట్‌లో ఉండే మాదిరిగానే గదులు కనిపిస్తాయి. టొమాటోను ఆలివ్ ఆయిల్, అవకాడోతో కలిపి తీసుకుంటే దీనిలో ఉండే లైకోపీన్ అనే పదార్ధం గుండెపోటు రాకుండా కాపాడుతుందట. అంతేకాదు కొన్నిరకాల క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం టొమాటోలో ఉంది. శరీరంలో ఉండే అనవసరపు కొలెస్టరాల్‌ను కూడా టొమాటో కరిగించేస్తుంది.

అరటి పండు..

అరటి పండును సునిశితంగా గమనిస్తే.. మనిషి పెదాల మాదిరగా ఉంటాయి. వీటిలో ఉండే సెరటోనిన్ అనే రసాయనం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. అంతేకాదు.. మూడు రెగ్యులేటింగ్‌గా కూడా ఉపయోగపడుతుంది.

అల్లం..

ఘాటైన వాసన కలిగి ఉండే అల్లం. చైనాలో విరివిగా వాడే అల్లం రెండు వేల ఏళ్ళ నుంచి వాడకంలో ఉంది. కడుపులో వచ్చే వికారాలు, జీర్ణ సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తుంది. దీని షేపు గమనిస్తే కడుపులో ఉండే జీర్ణాశయం మాదిరిగా ఉంటుంది. ఎంత తిన్నా కొద్దిగా అల్లం వాడితే దెబ్బకు అరిగిపోతుంది.

 

సో..చూడండి..తినండి.. ఆరోగ్యంగా ఉండండి.

 

Read Also

 
Related News
JournalistDiary