India / Entertainment
ప్రేమకథ ఎంతవరకు వచ్చింది?
11 days ago

అక్షయ్‌కుమార్- భూమిక పెడ్నేక‌ర్ జంటగా బాలీవుడ్‌లో రానున్న ఫిల్మ్ ‘టాయిలెట్ ఏక్ ప్రేమ‌క‌థ‌’. దీనికి సంబంధించి
మూడు నిమిషాల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. స్వచ్ఛభార‌త్ కాన్సెప్ట్‌తో రానున్న ఈ సినిమాకి ప్రధాని మోదీ సాక్షిగా
బోలెడంత పాపులారిటీ వ‌చ్చింది. ఇటు క్రాక్- టాయిలెట్ సినిమా రెండూ ఒకటేనని అంటున్నవాళ్లు లేకపోలేదు. షూటింగ్ పూర్తికావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు క్లైమాక్స్ చేరాయి. దీంతో ప్రమోషన్‌లో నిమగ్నమైంది యూనిట్. శ్రీనారాయ‌ణ్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ఆగస్టు 11న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన. మరి ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేద్దాం..

 

 
 
 
Related News

JournalistDiary