AP and TS / Politics
టీఆర్ఎస్‌ చీఫ్‌గా కొత్త రెడ్డి.. తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్
114 days ago

ప్రత్యర్ధుల‌ను దెబ్బతీయ‌డంలో ఆరి తేరిన ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్.. ఇప్పుడు మ‌రో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌కి శ్రీ‌కారం చుట్టబోతున్నారు. తెలంగాణాలో కీల‌కంగావున్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో పెరుగుతున్న అస‌హ‌నాన్ని గుర్తించారు. దీంతో  ఆ సామాజిక వర్గం   వారినే అంద‌ల మెక్కించి బుజ్జగించే  పనిలోపడ్డారు కేసీఆర్. అటు  టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రాబోయే ఎన్నిక‌ల నాటికి త‌మ సామాజిక వ‌ర్గం వారంద‌రినీ ఒక్కతాటి మీదకి తీసుకురావ‌డానికి ప్రయ‌త్నానికి గండి కొట్టాలని డిసైడయ్యారు. ఇందుకు సీనియ‌ర్ నేత హోంమంత్రి నాయ‌ని న‌ర్సింహారెడ్డి పేరును ముందుగా ప‌రిశీలించిన‌ప్పటికీ, వ‌య‌సు రీత్యా ఆయ‌న కంటే యువ‌కుడైన ప‌ల్లా రాజేశ్వర‌రెడ్డి వైపే మొగ్గు చూపిన‌ట్టు సమాచారం. 

వ‌రంగ‌ల్ జిల్లా ధ‌ర్మసాగ‌రం మండ‌లానికి చెందిన రాజేశ్వరరెడ్డి పెరిగింది మాత్రం న‌ల్గొండ జిల్లాలో! అనురాగ్ విద్యా సంస్ధల అధినేత‌గావున్న ఆయన... సీఎంకి అత్యంత స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం శాస‌నమండ‌లి స‌భ్యుడు.. విప్‌గా ఉన్న రాజేశ్వర‌రెడ్డికి ఏప్రిల్‌లో జ‌రిగే తెలంగాణా రాష్ట్ర స‌మితి ప్లీన‌రీలో అధ్యక్ష బాధ్యత‌లు క‌ట్టబెట్టే అవ‌కాశం ఉందని ఇన్‌సైడ్ సమాచారం. ఒక్క వ్యక్తికి ఒక్క ప‌ద‌వి ఉండాల‌న్న నిబంధ‌న‌ని కూడా త్వర‌లోనే తీసుకురాబోతున్న కెసిఆర్ ముందుగా త‌ననుంచే ఆ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న రీతిలో త‌మ పార్టీలో కొంచెం ఓవ‌ర్ యాక్షన్ చేస్తున్న వారిని క‌ట్ చేయ‌డంతోపాటు, ప్రత్యర్ధి పార్టీలు కులాల ప్రాతిప‌దిక‌న త‌మ‌ని ఇబ్బంది పెట్టకుండా చేసుకోవ‌డం కోస‌మే గులాబీ అధిపతి ఈ ఆలోచ‌న చేస్తున్నట్టు ముఖ్యమంత్రి స‌న్నిహితులు చెబుతున్నారు. 

 

 
 
 
Related News

JournalistDiary