AP and TS / Entertainment
ఖైదీ మూవీ.. అమ్మ చనిపోయినంత బాధంటూ...
113 days ago

‘‘మెగాస్టార్ గారి 150వ సినిమాలో నటించడం నా అదృష్టం.. సీన్స్ తీసివేయడం నా దురదృష్టం.. సంక్రాంతి రోజున మా మదర్ చనిపోయినంత బాధగా వుంది’’ ఇది కమెడియన్ పృధ్వీ మనోవేదన. ఖైదీ నెంబర్ 150వ సినిమాలో నుంచి ఈ కమెడియన్ నటించిన సన్నివేశాల్ని తొలగించినట్టు వార్తలు షికార్లు చేయడంతో తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కాడు ఆయన.  


పృధ్వీ ఆవేదన వ్యక్తంచేసినట్టుగానే ఖైదీలో ఆయన సన్నివేశాలు తొలగించారా అన్నదే ప్రశ్న. బ్రహ్మానందం నటించిన 18 సీన్లని ఎలివేట్ చేశారని, ఆ కారణంగానే పృధ్వీ సీన్స్‌ని తొలగించారంటూ ఫిల్మ్‌నగర్ ఓ వార్త రెండురోజులుగా షికారు చేసిన విషయం తెల్సిందే!

 

 
 
 
Related News

JournalistDiary