India / Crime
శేఖర్‌రెడ్డి డొంక.. టాప్ బిజినెస్‌మేన్ అరెస్ట్
302 days ago

కోల్‌‌కతాకు చెందిన టాప్ బిజినెస్‌మేన్ పర్సామల్‌ లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌- ఈడీ గురువారం అరెస్టు చేసింది. 25 కోట్లు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు ప్రయత్నించినందుకు ఆయన్ని ముంబై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. లోధా.. రియల్‌ ఎస్టేట్‌‌, మైనింగ్ వ్యాపారాలు కూడా చేస్తాడట.  

రీసెంట్‌గా లాయర్‌ రోహిత్‌ టాండన్‌ ఆఫీసులో పెద్ద మొత్తంలో మనీ దొరకింది. ఆ నగదు తనదికాదని బిజినెస్‌మేన్ లోధా పేరు చెప్పడంతో అలర్టయిన అధికారులు ఆయనపై లావాదేవీలపై కన్నేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌ రెడ్డి బ్లాక్‌మనీని వైట్‌గా మార్చడంలో లోధా సహకరించినట్లు అంతర్గత సమాచారం. ఇటీవల లోధా తన కూతురు మ్యారేజ్‌ని కళ్లు చెదిరేలా చేశాడు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అప్పటినుంచే లోథాపై ఐటీ అధికారులు కన్నేసి ఉంచిన విషయం తెల్సిందే! ఇప్పటికే శేఖర్‌రెడ్డి బుధవారం అరెస్ట్ కాగా, తాజాగా లోధా వంతైంది. రేపటి రోజున ఇంకెంత మంది బ్లాక్‌మనీ రాయుళ్లు వెలుగులోకి వస్తారో చూడాలి. 

 

Read Also

 
Related News
JournalistDiary