India / Entertainment
అమితాబ్ గురించి మనకు తెలీని 10 నిజాలు
9 days ago
అమితాబ్ హరివంశ్ రాయ్ శ్రీవాస్తవ బచ్చన్.. అలియాస్ షహెన్ షా ఆఫ్ బాలీవుడ్..! ఈ అక్టోబర్ 11తో 75 వ ఏట ఎంట్రీ ఇచ్చేశారు. బిగ్ బీ అంటూ పేరులోనే పెద్దరికాన్ని జమచేసుకున్న బచ్చన్ సాబ్ గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏముంటుంది ? చిన్నదో పెద్దదో.. వెండితెరో. బుల్లితెరో..! ఎప్పుడూ ఏదో ఒక అవతారం. కళ తప్పని మొహంతో.. ఎప్పుడూ కళ్లెదుటే కనిపిస్తూ.. సగటు సినిమా ప్రేమికుడితో సాన్నిహిత్యం కంటిన్యూ చెయ్యడం.. ఈ అభిమాన ధనుడికీ, ముప్పాతికేళ్ల పెద్దమనిషికీ వున్న ఒకానొక దొడ్డ బుద్ధి. కాలంతోపాటు తనూ మారిపోతూ, ఎప్పుడూ ట్రెండీగా కనిపిస్తూ, మూడ్నాలుగు తరాలవాళ్లతో సమాంతరంగా నడవడం తెలిసిన ఈ బుడ్డా గురించి మరికొన్ని రేర్ అండ్ రేరెస్ట్ న్యూస్.. మీకోసం..!
 
- అమితాబ్ సవ్యసాచి లాంటోడు. రెండు చేతులతోనూ పెన్ను పట్టి రాయగల అరుదైన సామర్థ్యం ఆయన సొంతం.
 
- యాక్టర్ ఆఫ్ మిలీనియం అంటూ బిగ్బీకి బీబీసీ న్యూస్ పోల్ పట్టం కట్టింది. చార్లీ చాప్లిన్, సర్ లారెన్స్ ఒలివర్, మార్లొన్ బ్రాండో లాంటి ఉద్దండులనే ఓడించిన క్రెడిట్ అమితాబ్ సొంతం!
 
- తెరకెక్కక ముందు బిగ్ బీ.. స్టేజ్ యాక్టర్ గా, రేడియో అనౌన్సర్ గా, కలకత్తాలో ఓ ట్రాన్స్ పోస్ట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ గా కూడా పని చేశారు. 
 
- సినిమా హీరో కావాలన్నది అమితాబ్ ఫుల్ టైం డ్రీమ్ కాదట! ఇంజనీరింగ్ చదవి ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో చేరడం అతడి మెరుపుకల!
 
- ఇప్పుడు చరిత్రకెక్కి కోట్లమంది ఇష్టంగా వినే అమితాబ్ గద్గద స్వరాన్ని మొదట్లో ఆలిండియా రేడియో అడ్డంగా తిరస్కరించింది. 
 
- 58 ఏళ్ల వయసులో 'అక్ష్'  సినిమా కోసం కో-స్టార్ మనోజ్ బాజ్పాయ్ తో కలిసి 30 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసి 'ఎవర్-యంగ్' అని ప్రూవ్ చేసుకున్నారు 
 
- 2006లో రిలీజైన 'షూటవుట్ ఎట్ లోఖండ్ వాలా' సినిమా కోసం ఐదు గంటల్లో 23 సీన్లలో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. 
 
- కోటి రెన్యుమరేషన్ తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరో అమితాబ్. 1990 కి ముందు కోట్లకు అమ్ముడైన కాల్షీట్స్ కేవలం అమితాబ్ వే!
 
- 1969లో బ్రిటిష్ ఎయిర్వేస్ లో చేసే ఒక ఎయిర్ హోస్టెస్ తో అమితాబ్ బాగా తిరిగినట్లు చెప్పుకునేవారు. ఆమె పేరు మాయ!
 
- 'డ్యూయెల్ రోల్' వేసిన సినిమాల్లో అమితాబ్ దే ఆల్ టైమ్ రికార్డ్. మహాన్ అనే మూవీలో అమితాబ్ మూడు పాత్రలు వేశారు. 'విజయ్' పేరుతోనే ఏకంగా 19 సినిమాల్లో నటించారు.
 

Read Also

 
Related News
JournalistDiary