World / Health
పెట్ బాటిళ్లలో కూల్ పాయిజన్?
141 days ago

పెట్ బాటిల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే..ఇండియాలో పెట్  బాటిల్స్ వాడకం వల్ల వచ్చే అనర్ధాలపై భారత ప్రభుత్వం నియమించిన ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లి్క్ హెల్త్ (AIIH&PH) కమిటీ తన నివేదికను సమర్పించింది. రెండు మల్టీ నేషనల్ కంపెనీలు తయారు చేసే పెట్ బాటిళ్ళలో ప్రమాదకరమైన పదార్ధాలున్నాయని తేల్చింది. ముఖ్యంగా కోకోకోలా, పెప్సీ కోలా కంపెనీలకు చెందిన 600 ml పెప్సీ, కోకో కోలా, మౌంటెన్ డ్యూ, స్ర్పైట్, సెవెన్అప్.. పెట్ బాటిళ్లను పరిశీలించి ఈ మేరకు నివేదిక ఇచ్చింది.

ఈ పరీక్షల్లో పెట్ బాటిల్ డ్రింక్స్ లో యాంటిమొనీ,లెడ్, క్రోమియం, కాడ్మియం, ఇథైలెక్సీల్, డై ఫైలేట్ లాంటి అపాయకరమైన లోహాల అవశేషాలున్నట్టు తెలిపింది. పెట్ బాటిల్ కూల్ డ్రింక్స్ లో లోహ అవశేషాలు ఉండటం నిషేధమనికూడా కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇదిలాఉంటే, పెట్ బాటిల్స్ లో ఉండే భారలోహాలు రూం టెంపరేచర్ లో నిల్వ ఉంచినప్పుడు వాటి పరిమాణం పెరుగుతుందనీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెబుతోంది. అయితే కమిటీ నివేదికకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించేందుకు కోకోకోలా నిరాకరించింది. అటు పెట్ కంటైనర్ మాన్యుఫాయ్చరర్స్ అసోసియేషన్ కూడా ఈ కథనాల పై నోరు మెదపడం లేదు. 

 

 
 
 
Related News

JournalistDiary