World / Politics
తప్పుడు రాతలు రాస్తే.. లైసెన్స్ క్యాన్సిల్
8 days ago

తనకు వ్యతిరేకంగా తప్పుడు రాతలు రాస్తే తోకలు కట్ చేయడం ఖాయమని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. కొన్ని మీడియా నెట్‌వర్క్ లు ఫేక్‌న్యూస్ ప్రచారం చేస్తున్నాయని, తన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు. ఇందుకు ఉదాహరణగా తన అణువిధానం (న్యూక్లియర్ పాలసీ)పై ఎన్‌బీసీ వంటి ఛానెళ్లు తప్పుడు కథనాలు రాశాయని దుయ్యబట్టారు. అమెరికా తన అణ్వాయుధాలను పదింతలు పెంచాలని యోచిస్తోందంటూ ఎన్‌బీసీ ప్రచారం చేసిన వార్తా కథనం కట్టుకథ అని అభివర్ణించారు. ఇలాంటి నెట్‌వర్క్ లు ఈ విధమైన ఫేక్ న్యూస్ ఇస్తుంటే వీటి లైసెన్సులను పొడిగించడం సబబా.. ఇది దేశానికే చాలా బ్యాడ్ అని ట్వీట్ చేశారు. ఏకపక్షంగా, పక్షపాత పూరితంగా వక్రీకరించిన వార్తలు ఇవ్వడం మంచిదా? అని ప్రశ్నించారు. అవసరమైతే వీటి లైసెన్సులను రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. నిజానికి అమెరికాకు మరిన్ని అణ్వాయుధాలే కాక, అదనపు సైనిక దళాలు, ఆయుధ సంపత్తి అవసరమని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారని ఇద్దరు అధికారులు స్పష్టంచేశారు.

గత జులైలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ కచ్చితంగా ఇదే మాట్లాడారని వారన్నారు. పత్రికలు, ప్రచార సాధనాలు తమ ఇష్టమొచ్చినట్టు రాసుకోవడం చాలా బాధాకరమని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా-తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే ఛానెళ్ళను మూసివేస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అప్పుడే వివాదాస్పదమవుతోంది. ఇది అసలిది సాధ్యమా అని సెనేటర్లు కొందరు ప్రశ్నిస్తుండగా, మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్, తరచు ట్రంప్ ను వ్యతిరేకించే ప్రీత్ భరారా..ఆయనను ఓ చిన్న పిల్లాడిలా (చైల్డిష్) అభివర్ణించారు. ట్రంప్ ను వెంటనే ఓ బాలల సంరక్షణా కేంద్రానికి తరలించాల్సిన అవసరం ఉంది అని ట్వీట్ చేశారు. కాగా-తనకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే ఛానెళ్ళను మూసివేస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అప్పుడే వివాదాస్పదమవుతోంది. ఇది అసలిది సాధ్యమా అని సెనేటర్లు కొందరు ప్రశ్నిస్తుండగా, మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్, తరచు ట్రంప్ ను వ్యతిరేకించే ప్రీత్ భరారా..ఆయనను ఓ చిన్న పిల్లాడిలా (చైల్డిష్) అభివర్ణించారు. ట్రంప్ ను వెంటనే ఓ బాలల సంరక్షణా కేంద్రానికి తరలించాల్సిన అవసరం ఉంది అని ట్వీట్ చేశారు.

 

Read Also

 
Related News
JournalistDiary