AP and TS / General
వీళ్ళిద్దరూ సేఫ్ !
14 days ago

ఇద్దరు తెలుగు సెలెబ్రిటీలు ఆస్పత్రిపాలయ్యారన్న వార్త శనివారం నాడు సంచలనం సృష్టించింది.  ఒకరు నటరత్న బాలకృష్ణ, మరొకరు మీడియా మొఘల్ రామోజీ రావు. ఆకస్మికంగా వెన్ను నొప్పి రావడంతో బాలకృష్ణ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. శుక్రవారం కూడా తెలంగాణ అసెంబ్లీ, సీఎం క్యాంపాఫీసు దగ్గర బాలకృష్ణ చలాకీగా తిరిగినట్లు మీడియాలో చూసిన ఫ్యాన్స్.. అకస్మాత్తుగా 'ఆస్పత్రి' వార్తలు వినిపించేసరికి షాక్ అయ్యారు. ప్రాధమిక పరీక్షల తర్వాత బాలకృష్ణ డిశ్చార్జ్ అయినట్లు తెలుసుకున్న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇటు బిజినెస్ టైకూన్ రామోజీరావు కూడా వెన్నునొప్పి, వైరల్ ఫీవర్, శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం యశోదాలో అడ్మిట్ అయ్యారు. సీనియర్ ఫిజీషియన్ ఎన్వీ రావ్, పల్మనాలజిస్ట్ నవనీత్ సాగర్ రామోజీ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా స్థిమితంగానే ఉందని, డిశ్చార్జ్ అయ్యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

 
 
 
Related News

JournalistDiary