World / Health
చికెన్ తింటే చిక్కులే..
329 days ago

చికెన్ అంటే ఎగబడి తినేవాళ్లకో బ్యాడ్ న్యూస్.. మనం తినే మూడొంతుల చికెన్ లో రెండొంతులు చికెన్ యాంటీ బయాటిక్ రెసిస్టెంట్ అయిన ఇ కోలీ బాక్టీరియా సోకినదేనని తాజా పరిశోథనలు తేల్చాయి. షాపుల నుంచి తెచ్చిన చికెన్ లో ఉండే ఇకోలీ బాక్టీరియా వల్ల స్టమక్ అప్సెట్ అవడం, డయేరియా, వాంతులు లాంటి ఉదర సంబంధవ్యాధులు సోకే ప్రమాదముందట. ఒక్కోసారి ఈ సూపర్ బగ్  వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదముందట. ఇకోలి సూపర్ బగ్ యాంటి బయాటిక్ మందులను కూడా తట్టుకునే శక్తి ఉండటం వల్ల అధిక శాతం చికెన్ ఇకోలి సోకిన చికెన్ నే తీసుకుంటున్నారట. ఇకోలి బగ్ పై ఇంగ్లాండ్ మార్కెట్ లో జరిపిన సర్వేలో ఏటా ఐదువేలకు పైగా మరణాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఇంగ్లండ్ లో అమ్మే మూడొంతుల చికెన్ లో రెండొంతులు ఇకోలీ సూపర్ బగ్ సోకినదే అంటున్నారు ఎక్స్ పర్ట్ లు. గతం తో పోల్చితే ఇంగ్లాండ్ లో అమ్మే 78 శాతం కోడిమాంసంలో ఇకోలి అధికంగా ఉందట. సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్ లో అధిక శాతం ఇకోలి బగ్ సోకిందేనని గుర్తించారు.

ఈ బగ్ లోనికి ప్రవేశిస్తే.. ఒక్కేసారి ప్రభావం చూపకుండా శరీరంలో ఏళ్ల తరబడి ఉండిపోవడం వల్ల సెఫలోస్పోరిన్స్ అనే బాక్టీరియా అభివృద్ధి చెందడం వల్ల  ఇన్ఫెక్షన్ లాంటివి సోకే ప్రమాదముందట.  యూనివర్సిటి ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు పేరున్న మార్కెట్ల నుంచి తెచ్చిన చికెన్ పై జరిపిన పరిశోథనల్లో అధిక మొత్తంలో  కలుషితమని తేలింది. ఈ పరిశోధనొక్కటే కాదు.. డిపార్ట్ మెంట్ ఫర్ ఎన్విరాన్ మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ , ఇంగ్లాండ్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లండ్ లో  దొరికే చికెన్లో అధిక శాతం చికెన్ ఇకోలి బగ్ కలిగిందేనని తేల్చారు. సో.. ఏతావాతా దీన్నిబట్టి తేలిందేమిటంటే.. ముందు ముందు అతిగా ఇకోలి బాక్టీరియా సోకిన చికెన్ తింటే.. భారీ మూల్యం చెల్లించాల్సిందేనంటున్నాయి పరిశోథనలు. అదే విధంగా అతిగా యాంటీ బయాటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. పౌల్ట్రీ రంగంలో ఒక రోజు వయసున్న కోడిపిల్లకు అడ్వాన్స్డ్ సెఫలో స్పోరిన్స్ ఇవ్వడం జరుగుతుందనీ.. ఇది ఎంతో  ప్రమాదకారి అని హెచ్చరించినా వెటర్నరీ మెడిసిన్స్ డైరెక్టరేట్  ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు.

ఈ యాంటీబయటిక్స్ వాడకం వల్ల వస్తున్న చెడుప్రభావాలను గమనించి పౌల్ట్రీ రంగమే  స్వఛ్చందంగా  వాటివాడకం ఆపేసింది. సాధారణంగా ఇకోలి బగ్ ముడి ఆహార పదార్ధాలనుంచి వ్యాపిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం సరిగా ఉడికించకపోయినా, కలుషిత నీటిని తాగినా, వాటితో స్నానం చేసినా ఇకోబగ్ ఉన్న జంతువులను తాకినా, ఎరువులనుంచి కూడా ఇకోలి వ్యాప్తి చెందే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.  కోళ్లలోనే ఇకోలీ బగ్ ఎందుకు వృధ్ది చెందుతుందంటే.. పౌల్ట్రీ రంగంలోనే అతిగా యాంటీ బయాటిక్స్  వాడుతున్నారనీ, అందుకే పౌల్ట్రీ చికెన్ లోనే ఇకోలీ బక్టీరియా అధికంగా చేరుతుంది. దీనినుంచి బయటపడాలంటే... చికెన్ స్టోర్స్ కు చేరుకునే ముందే  దానిలో బాక్టిరియా లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే సూపర్ బగ్ లేని నిఖార్సయిన చికెన్ తినే అవకాశం కలుగుతుందని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు..  

    

 

Read Also

 
Related News
JournalistDiary